YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఇవాళ్టి నుంచి స్వామి భక్తులకు గుడ్ న్యూస్

ఇవాళ్టి నుంచి స్వామి భక్తులకు గుడ్ న్యూస్

తిరుమల ఫిబ్రవరి 14,
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ  నిర్ణయించింది. ఫిబ్రవరి 15 నుంచి ఈ టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. 16వ తేదీ దర్శనం కోసం 15న ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. నిత్యం 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చెయ్యాలని టీటీడీ  ఏర్పాట్లు చేసింది . కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపేసింది. ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ సమాయత్తమైంది. కాగా రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తోంది.గత ఏడాది రోజుకు 2వేల చొప్పున ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లు జారీ చేసినా.. కొవిడ్‌కు తోడు భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ వాటిని నిలిపేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే రోజుకు 5వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెల విడుదల చేస్తోంది.ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు), వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో ప్రతిరోజు 25-30 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో రోజు15 వేల టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. దీంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలు దాటి పోయే అవకాశం ఉంది. 16వ తేదీన శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే వారు.. ఒకరోజు ముందుగానే టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది

Related Posts