YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్, చినజీయర్ మథ్య సమతా చిచ్చు

కేసీఆర్, చినజీయర్ మథ్య సమతా చిచ్చు

హైదరాబాద్, ఫిబ్రవరి 14,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉగిపోతున్నారు. ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. అవును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీలపై అయన మండి పోతున్నారు. అయితే, అది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. వినిపిస్తోంది. చేతల్లో కాకపోయినా, కనీసం మాటల్లో, త్రిభాష తిట్ల రూపంలో వ్యక్త పరిచడం ద్వారా ముఖ్యమంత్రి ఎంతో కొంత ఉపసమనం పొందుతున్నారు. కానీ, పైకి కనిపించకుండా లోలోపల కేసీఆర్’ను  దహించి వేస్తున్న ఆగ్రహం ఇంకొకటుంది. అవును, చిన జీయర్ స్వామిపైనా ఆయనలో ఆగ్రహం బుసలు కొడుతోంది. అవమానమును సహితునా, అన్న విధంగా ఆగ్రహంతో కుమిలి పోతున్నారు. నిజానికి, స్వామీజీనే శపించాలన్నంతగా ఆయన లోలోన ఆగ్రహానికి గురుతున్నారు. చిన జీయర్ స్వామికి, కేసేఆర్’కు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. నిజమే, చిన జీయర్ స్వామి కోట్ల రూపాయల ఖర్చుతో, 216 అడుగుల ఎత్తైన ‘సమతా మూర్తి’ శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని హైదరాబాద్ ముచ్చింతల్, (శ్రీరామ నగర్) ఏర్పాటు చేయగలిగారంటే, అ ఘనతలో కేసేఆర్ కాంట్రిబ్యూషన్ కాదనలేనిది. అయితే, చివరకు వచ్చే సరికి, స్వయంకృతమా,  ఇంకైమైనానా అనేది పక్కన పెడితే, ఎక్కడెక్కడివారో వచ్చి, పాల్గొన్న  సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలలో కేసీఆర్ ఎక్కడాలేరు. ఆటలో అరటి పండులా మిగిలిపోయారు. ఉత్సవాలు ప్రారంభమైన తొలి రోజు కేసీఆర్ వెళ్లారు, ఇక ఆ తర్వాత కేసీఆర్ కాదు తెరాస నాయకులూ ఎవరూ ఆ వైపుకు వెళ్ళలేదు. చివరకు, కన్నుల పడగగా జరిగిన సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల్లోనూ కేసీఆర్ కనిపించలేదు. ఇందుకు అనేక కారణాలు చెపుతున్నా, తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి చూస్తే, ఆయనకు ఆహ్వానమే లేదని తెలుస్తోంది. అందుకే, శిలాఫలకం మీద ముఖ్యమంత్రి పేరు కూడా లేదని అంటున్నారు. విగ్రహావిష్కరణకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకున్న( ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రెస్ మీట్) పరిణామాల నేపద్యంలో ముఖ్యమంత్రి వెళ్లలేదని ని అన్నా, లేక ఆయనకు జ్వరం వచ్చి వెళ్ళ లేదన్నా అది వేరే విషయం. కానీ, కొన్ని నెలలు ముందుగా సిద్దం చేసిన శిలాఫలకంపై ముఖ్యమంత్రి పేరు లేక పోవడం నిజంగా కేసేఅర్’కు పెద్ద షాక్ అంటున్నారు. చిన జీయర్ ఉద్దేశపూర్వకంగానే, కేసీఆర్’ను దూరంగా ఉంచారని అనుకోవలసి వస్తోందని అంటున్నారు. ఇది యౌ టూ బ్రూటస్’ అన్నంతగా కేసీఆర్’ను దెబ్బతీసిందని, ఇదే కేసీఆర్ ఆగ్రహానికి మూల కారణం అంటున్నారు. అంతే కాదు పుండు మీద కారం చల్లిన విధంగా, సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకలలో కేసీఆర్  ప్రస్తుత ప్రధమ శత్రువు మోడీ, బీజేపీలకు, సంఘ్ పరివార్ సంస్థలకు పెద్ద పీట వేయడం కేసీఆర్ అసలు జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు. అందుకే  కేసేఆర్ చిన జీయర్ తీరుపై లోలోన చిందులు వేస్తున్నారని అంటున్నారు.
అయితే, చిన జీయర్’ ఎందుకు కేసీఆర్’ను దూరం పెట్టారు, అంటే, కేసీఆర్’ను ఉచ్చులలో బిగించే వ్యూహంలో భాగంగానే, బీజేపే అగ్రనేతలు స్వామీజీతో సాన్నిహిత్యం పెంచుకున్నారని, అది కూడా కేసీఆర్ అగ్రహావేశాల, అనాలోచిత వ్యాఖ్యలకు కారణమని అంటున్నారు. నిజానికి సమతామూర్తిని కేసీఆర్, ఉత్తరాదిన తన ప్రచార మూర్తిగా చేసుకోవాలనుకున్నారు. జాతీయ రాజకీయాల విషయంలో ఉత్తరాదిలో హిందూ ముద్ర తనకు సమతమూర్తి ద్వారా వస్తుందనుకున్నారు. చివరకుకనీసం శిలాఫలకం మీద కూడా తన పేరు లేకపోవడంతో ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నారని అంటున్నారు. అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గాయన్ని’ ఇక్కడితే  మరిచి పోతారా లేక చిన జీయర్’ పైనా మోడీ పై ప్రకటించిన విధంగా యుద్దాన్ని ప్రకటిస్తారా అన్నది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, అదే సమయంలో చిన జీయర్ గుట్లు కేసీఆర్ దగ్గర వుంటే, కేసీఆర్ గుట్లు స్వామీజీ దగ్గర ఉన్నాయి. అంతేకాదు, జీయర్ వెనక ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం వుంది . సంఘ్ పరివార్ వుంది. హిందూ సమాజం వుంది. అన్నిటినీ మించి కేసీఆర్ అవసరం స్వామీజీ కంటే, స్వామీజీ అవసరం కేసీఆర్’ కు వుందని, అందుకే రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పాల్గొనే, శ్రీ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉందని, అందుకు  రెండు విపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Related Posts