YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ జాతీయ పార్టీ అడుగులు

కేసీఆర్ జాతీయ పార్టీ అడుగులు

హైదరాబాద్, ఫిబ్రవరి 14,
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా అవసరమని కోరుకుంటే దేశంలో కొత్త పార్టీ పెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీ పెడుతారా అని ఓ జ‌ర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఇలా సమాధానమిచ్చారు. కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము తనకు లేదా అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే తనను ఎవరు అడ్డుకుంటారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఏమైనా జరగవచ్చన్నారు.తాను పుట్టగానే సీఎంను అవుతానని తన తల్లిదండ్రులు కలగన్నారా? ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంటే.. అవకాశాలు అవే వస్తాయని కేసీఆర్ తెలిపారు. తాను తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని ఏర్పాటు చేసిన‌ప్పుడు కూడా అంద‌రూ న‌వ్వార‌ని కేసీఆర్ గుర్తుచేశారు. అప్పుడు న‌వ్విన వారు.. ఇప్పుడు ఏం చేస్తున్నార‌ని ప్రశ్నించారు.ఉద్యమం చేస్తామ‌ని తాను ప్రక‌టించిన నాడు కూడా అంద‌రూ న‌వ్వార‌న్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చూపించామ‌న్నారు. ఇప్పుడు తాను జాతీయ పార్టీ పెట్టినా ఎవ‌రూ అడ్డుకోర‌ని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.తెలంగాణలో విద్యుత్తు సంస్కరణలను అమలుపర్చడం లేదని రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఆపేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ఉపాధి పథకం వంటి పథకాల్లో రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారు. మోదీకి ఎనిమిదేళ్లు టైం ఇచ్చామని చెప్పారు. ఎనిమిదేళ్లు వేచి చూసినా ఆయనలో మార్పు రాలేదని, సంస్కరణల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉన్నారని కేసీఆర్ మండి పడ్డారు. విద్యుత్తు శాఖను పూర్తిగా ప్రయివేటీకరించి ఆయన తాబేదార్లకు అప్పజెప్పాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి విరాళాలిచ్చే వారికే విద్యుత్తును అప్పగించాలన్న కుట్ర జరుగుతుందన్నారు. 77 శాతం సంపద కేవలం పది మంది చేతుల్లోనే ఉందని ఆరోపించారు. అదే జరిగితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. విద్యుత్తు ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయని కేసీఆర్ చెప్పారు. తమకు విషయం అర్థమయ్యే మోదీ రంగు బయటపెట్టానని అన్నారు. డిస్కమ్ లను ప్రయివేటుపరం చేయాలనుకోవడం దారుణమని కేసీఆర్ చెప్పారు. సంస్కరణల్లో భాగంగా సబ్సిడీలను ఎత్తివేయాలని కండిషన్లు పెట్టారన్నారు. పేదప్రజలు ఏమై పోతారని కేసీఆర్ ప్రశ్నించారు. జలవిద్యుత్తు ను ఆపేసి సౌర విద్యుత్తునే కొనుగోలు చేయాలని షరతు పెడుతుందన్నారు. 40 వేల కోట్ల మంది దళితులకు బడ్జెట్ లో 12 వేల కోట్లు కేటాయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కిషనర్ రెడ్డి తనకు బడ్జెట్ పై అవగాహన లేదన్నారని, ఈసారి అలా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. ఎనిమిదేళ్లలో ఏ రంగం? ఏరంగంలో అభివృద్ధి సాధించారో చెప్పాలని కేసీఆర్ మోదీని నిలదీశారు. ఎన్ఎస్ఈ చెప్పిన లెక్కల ప్రకారం ఉపాధి, పారిశ్రామిక రంగంలో ఏం సాధించావో తెలిసిపోతుందని చెప్పారు. ఆయన అభివద్ధి అంతా వాట్సాప్ యూనివర్సిటీలోనే కన్పిస్తుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. నిజంగా 12 శాతం వృద్ధి ఉందా అని ప్రశ్నించారు. అదే జరిగితే దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేదన్నారు. బీజేపీ పాలనలో దేశం సర్వనాశనమయిందన్నారు. అన్ని రంగాలను అమ్మేసేటందుకే మోదీ వచ్చారన్నారు. క్షుద్ర సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. ఈ దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలని కేసీఆర్ మరోసారి డిమాండ్ చేశారు.

Related Posts