నందిగామ
సంచలనం కలిగించిన బాలిక అత్యాచారం హత్య కేసును కంచికచర్ల పోలీసులు ఛేదించారు. కంచికచర్ల మండలం కీసర గ్రామ శివారు సుబాబుల్ తోటలో ఈనెల 9వ తేదీన బాలిక మృతదేహం లభ్యం అయిన విషయ తెలిసిందే. బాలిక సొంత బాబాయి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. డియస్పి జి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిని ఆరెస్టు చేససారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మృతురాలు సహకరించపోవడంతో రాయితో తలపై మోది హతమార్చాడు. నిందితుడిపై గతంలో ఒక కేసు నమోదయిందని, ఆ కేసులో శిక్ష అనుభవంచాడని పోలీసులు వెల్లడించారు.