భారతదేశంలోనే మొట్టమొదటి NFT మూవీ మార్కెట్ ప్లేస్‌గా Oracle Movies చరిత్రకెక్కనుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ నిర్మాతలు మరింతగా ఆదాయాన్ని ఆర్జించడంలో సహాయం చేయడమే దీని లక్ష్యం. దీంతో భారతదేశంలో మూవీ బిజినెస్ రూపురేఖలే గణనీయంగా మారిపోతాయని అంచనా. ఈ క్రమంలో భాగంగానే టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్ సెంథిల్ నాయగమ్, చిత్ర నిర్మాత మరియు మూవీ బిజినెస్ కన్సల్టెంట్ జి.కె. తిరునావుక్కరసు కలిసి Oracle Moviesని స్థాపించడానికి చేతులు కలిపారు. ఇది భారతీయ ప్రప్రథమ NFT మూవీ మార్కెట్ ప్లేస్ కానుంది.
నాన్-ఫంగిబుల్ టోకెన్.. సంక్షిప్తంగా NFT. అధునాతనమైన, సురక్షితమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా మూవీ రైట్స్ కొనడానికి, అమ్మడానికి ఇది చిత్రనిర్మాతలకు, కంపెనీలకు తోడ్పడుతుంది.
NFT ఎంత విశిష్టమైనదంటే, మరేదీ దీన్ని భర్తీ చేయలేదు. కాబట్టి ఇది మాల్ ప్రాక్టీస్‌లను నిరోధించడమే కాకుండా, స్టాక్‌హోల్డర్లకు సురక్షితమైన, భద్రతతో కూడిన వాతావరణాన్ని కూడా అందిస్తుంది.
ప్రారంభంలో Oracle Movies సంస్థ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల నిర్మాతలకు, IP రైట్స్ ఉన్నవారికి తన సేవలను అందించనుంది. అతి త్వరలోనే ఈ సేవలు దేశంలోని ఇతర భాషల చిత్రాలకు కూడా విస్తరించనున్నాయి.
ఈ సందర్భంగా Oracle Movies COO విజయ్ డింగరి మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం కంటెంట్ అనేది కింగ్.. ఓటీటీలు సరైన కంటెంట్ కోసం వెతుకుతున్నాయి. అలాగే నిర్మాతలు కంటెంట్ కోసం, అలాగే వారి దగ్గర ఉన్న కంటెంట్‌ను అమ్మేందుకు సరైన వేదిక కోసం చూస్తున్నారు. ఓటీటీలకు, నిర్మాతలకు మధ్య ఉన్న అంతరాన్ని NFT తీర్చుతుంది. ఒక్కోసారి తమ దగ్గర ఉన్న కంటెంట్ ఏదో విధంగా అమ్ముడైతే చాలు అన్నట్లుగా తెలియక వ్యవహరిస్తుంటారు. అలాంటి వారికి అవగాహన పెంచేలా, ధరతో పాటు ఏ ప్లాట్‌ఫామ్ కరక్టో కూడా సూచించడంలో NFT సహాయం చేస్తుంది. ప్రస్తుత చిత్ర వాణిజ్యం కాగితపు ఒప్పందాలపైనే ఆధారపడి ఉన్నందున, ఇది ఆధునిక సినిమాకు ఏమంత మంచిది కాదు. అలాగే మూవీ రైట్స్‌ను అమ్మిన ట్రాక్‌ను కనిపెట్టడానికి ఒక సెంట్రల్ ఏజెన్సీ కూడా ఈ వ్యవస్థలో అందుబాటులో లేదు. ఈ భారీ అంతరాన్ని పరిష్కరించడానికే NFT సులభమైన రీతిలో అడుగుపెడుతోంది. Oracle Movies కూడా అలాంటి వన్ స్టెప్ సర్వీస్ ప్రొవైడర్ పాత్రను పోషించనుంది. ఇంకా ఇతర వివరాల కోసం vijay@oraclemovies.com లేదా 9000088877 నెంబర్‌కు సంప్రదించవచ్చు..’’ అని తెలిపారు.