YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ "#69 సంస్కార్ కాలనీ" మార్చి 4న విడుదల

యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ "#69 సంస్కార్ కాలనీ"  మార్చి 4న విడుదల

లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం "#69 సంస్కార్ కాలనీ . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 4న విడుదలకు సిద్ధమైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్  ట్రైలర్ ను పాత్రికేయుల సమావేశంలో విడుదల చేశారు..ఈ సందర్భంగా ..
చిత్ర హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఎమోషనల్ గా నా హార్ట్ కు దగ్గరగా ఉంది. నేను చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులు నన్నెంతో ఆదరించడం తో నాకు మంచి గుర్తింపు లభించింది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమను నేనెప్పుడూ మర్చిపోలేను. ఆ తర్వాత మంచి సినిమా చేయాలి అనుకుంటున్నా టైం లో సునీల్ కుమార్ గారు ఈ కథ చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా  అనిపించింది. ఇది ఫాంటసీ గానో , ఇమాజినేషన్  గానో కాకుండా ఉండే  స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా. ప్రస్తుతం సొసైటీలో రిలేషన్ షిప్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయ్యింది. ఇప్పుడు మనము బ్రతుకు తున్న లైఫ్ కూడా చాలా  కాంప్లికేటెడ్. ఇలాంటి సొసైటీ లో జరుగుతున్న చాలా విషయాల్లో లో హ్యుమాన్ రిలేషన్ షిప్ ఒకటి. ఇలాంటి పరిస్థితులు  చాలా మంది లైఫ్ లలో ఎదురవుతూ ఉంటాయి. . ఇలాంటి పరిస్థితులలో ఉన్న కథను మంచి కథనం తో తయారు చేయడం జరిగింది. ఈ కథ చాలా ఇంట్రెస్ట్ గా ఉండడమే కాకుండా  వినోదాత్మకంగా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
రిశ్వి తిమ్మరాజు మాట్లాడుతూ..  నాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు మరియు స్వాతి గార్లకు ధన్యవాదాలు..నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మా మూవీ లో  కామెడీ, ఫన్, రొమాన్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. మార్చి 4న విడుదల అవుతుంది.  గొప్ప విజయం సాధిస్తుంది అని అన్నారు.
ఎడిటర్ కృష్ణ మాట్లాడుతూ.. సమాజంలో  జరుగుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని  దృష్టిలో పెట్టుకుని మంచి సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకుని  ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మంచి విజయం సాధిస్తుంది అన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
లిరిక్ రైటర్ గమన్ శ్రీ మాట్లాడుతూ.. స్వాతి గారు ఇచ్చిన ఈ మంచి కథను సునీల్ కుమార్ రెడ్డి గారు వాస్తవిక సంఘటనల ఆధారంగా సమాజానికి మెసేజ్ ఇస్తూ చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
చిత్ర నిర్మాత బాపిరాజు గారు మాట్లాడుతూ.. #69 సినిమా చేసిన సునీల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సునీల్ గారు కంటెంట్ ఉన్న కథలను చేయడానికి మాత్రమే ఇష్టపడతారు. గంగపుత్రులు, సొంత ఊరు, గల్ఫ్ లాంటి  సినిమాలు మాత్రమే కాదు రొమాంటిక్ అంశాలు ఉన్న చిత్రాలను సైతం గతం లో తీసి మెప్పు పొందారు. కేవలం యువతని ఆకర్షించడానికి మాత్రమే కాకుండా కధకు ఉన్న అవసరం బట్టి బోల్డ్ గా చిత్రీకరించడానికి వెనుకాడని దర్శకుడు అతను.. ఈ కథను తను కూడా ప్రేమించి యువతకి నచ్చేలా తీర్చిదిద్ది మాకు అందించినందుకు ధన్యవాదాలు. అలాగే మా భీమవరం బుల్లెమ్మ ఎస్తర్ చాలా మంచి మనసున్న మనిషి. ప్రతి ఫ్రేమ్ లో అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది.   సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఫుల్ సపోర్ట్  చేసింది. తను మూడు సినిమాలు చేస్తున్నా కూడా మా సినిమా ప్రమోషన్స్ కి వచ్చి మాకు సపోర్ట్ చేస్తుంది. ఆమెకు మా కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ గా నిలిచిన ముతికి నాగ సత్యనారాయణ కు ధన్యవాదాలు. గతంలో మా 12 సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన ప్రవీణ్ గారు ఆ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శివరాం గారు, అద్భుతమైన కెమెరా ఫుటేజ్ ఇచ్చారు. డీఐ చేసిన పురుషోత్తం గారికి సౌండ్ మిక్సింగ్ చేసిన విష్ణు  గారి కి  నా ధన్యవాదాలు. గమన్ శ్రీ, యక్కలి  రవీంద్ర బాబు లు మంచి పాటలు రాశారు.నటీనటులు టెక్నీషియన్లు అందరూ చాలా సపోర్ట్ చేసిన సినిమా చాలా బాగా వచ్చింది.  మార్చి 4న వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని  కోరుతున్నాను అన్నారు
చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కమర్షియల్ పాయింట్ అనే కాకుండా సామాజిక సారం ఉండాలనే ఉద్దేశంతో ఈ స్టోరీని డెవలప్ చేసి నిజ జీవితానికి  దగ్గరగా ఉండే విధంగా తీర్చిదిద్దిన తరువాతే  షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఫ్రేమ్ ఎంతో ఇష్టంగా చాలా చక్కగా వచ్చేలా సహకరించిన నా టీం కి . దానికి సహకరించిన ఆర్టిస్టులకు ధన్యవాదాలు . ప్రతి పాత్రలో కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి  . త్వరలో వైశాలి కి సంబంధించిన మల్టిపుల్ డైమెన్షన్…ఉన్న  లుక్ ను రిలీజ్ చేస్తున్నాము. డెఫినెట్ గా ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను . మార్చి 4న వస్తున్న ఈ సినిమాకు మీ అందరి సహాయ సహకారాలు వుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నటీనటులు ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్, భద్రం,శిల్పా నాయక్  ,రామన్, Fm బాబాయ్,సముద్రం వెంకటేష్ తదితరులు

Related Posts