ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసారు మేకర్స్. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాన్స్ చాలా బాగుంది. మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. మార్చ్ 11, 2022న సినిమా విడుదల కానుంది.
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..