ముంబై, ఫిబ్రవరి 15,
దేశీయ టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫారమ్ ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ ప్లాట్‌ఫారమ్ గ్లాన్స్‌లో పెట్టుబడి పెట్టింది. వరుస పెట్టుబడులతో ముందుకు వెళుతున్న ముకేశ్ అంబానీ.. ఈ కంపెనీలో 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. తాజా పెట్టుబడితో ఇంటర్నేషనల్ మార్కెట్‌లపై పట్టు సాధించాలని రిలయన్స్ అధినేత భావిస్తున్నారు. శాటిలైట్ ద్వారా ఇంట్నెట్ సేవలు అందించేందుకు రెండు రోజుల క్రితం కంపెనీ మరో కంపెనీతో జతకట్టిన విషయం మనకు తెలిసిందే.జియో గ్లాన్స్ సాయంతో అమెరికా, బ్రెజిల్, మెక్సికో, రష్యా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో గ్లాన్స్ లాంచ్‌ను వేగవంతం చేయడమే లక్ష్యంగా రిలయన్స్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గ్లాన్స్ సైతం జియో పెట్టిన పెట్టుబడులను లాక్ స్క్రీన్‌పై అందిస్తూ విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే జియో ఫోన్లలో తమ గ్లాన్స్ అందుబాటులో ఉంటుందని ఇన్ మెుబైల్ గ్రూప్ వ్యవస్థాపకులు నవీన్ తివారీ వెల్లడించారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే మిలియన్ల జియో ఫోన్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.రిలయన్స్ పెట్టుబడులతో గత రెండేళ్లలో గ్లాన్స్ అసాధారణ వేగంతో వృద్ధి చెందింది. ఇంటర్నెట్, లైవ్ కంటెంట్, క్రియేటర్ ఎంటర్‌టైన్మెంట్, వాణిజ్యం, గేమింగ్ ను ఎంజాయ్ చేసేందుకు లాక్ స్క్రీన్‌లో ఇంటర్నెట్ వినియోగించేందుకు యూజర్లకు అనుభూతిని కలిగించనుందని ఆకాశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు