YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

తెరపైకి ఆఫీసుల అద్దెలు

తెరపైకి ఆఫీసుల అద్దెలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15,
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. వివిధ రాజకీయపార్టీ అధికార నివాసాలు, పార్టీ కార్యాలయాల అద్దెలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి అద్దెతో పాటు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం పెద్ద మొత్తంలో బకాయిపడింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఈ వివరాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ఇళ్లకు నిర్ణీత సమయం తర్వాత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పలువురు నాయకులతో పాటు పార్టీల కార్యాలయాలకు అద్దెలు చెల్లించడంలో అలసత్వం కనిపిస్తోంది.కాంగ్రెస్‌ పార్టీతో పాటు… దాని అధినేత్రి సోనియా గాంధీ కూడా దీనికి మినహాయింపు కాదని తేలిపోయింది. సోనియా గాంధీ తన అధికారిక నివాసానికి అద్దె చెల్లించలేదు. జన్‌పథ్‌ రోడ్డులోని నివాసముంటున్న ఆమె… 4 వేల 610 రూపాయల అద్దె బకాయి ఉన్నారు. అయితే, 2020 సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో అద్దె కట్టారు. ఆ తర్వాత అద్దె చెల్లించలేదు. అలాగే సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్‌ ఉంటున్న ఇంటికి కూడా 2013 తర్వాత అద్దె చెల్లించలేదు. చాణక్యపురిలో గల ఆ బంగ్లాకు 5 లక్షల 8 వేల రూపాయల అద్దె బకాయి ఉంది.అక్బర్ రోడ్డులో గల కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయానికి పదేళ్ళుగా అద్దె చెల్లించడం లేదు. 2012 తర్వాత అద్దె చెల్లించలేదట. దీంతో 12 లక్షల 70 వేల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. నిబంధనల ప్రకారం జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు మూడేళ్ల పాటు వసతి సౌకర్యం ఉంటుంది. తర్వాత ఆ పార్టీలు ప్రభుత్వ భవనాలు ఖాళీ చేసి, సొంతంగా కార్యాలయాల్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది.2010 జూన్‌లోనే ఢిల్లీ రౌజ్‌ ఎవెన్యూలో కాంగ్రెస్‌ పార్టీకి భూమి కేటాయింపు జరిగింది. కానీ భవన నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. 2013లోనే అక్బర్ రోడ్డులోని కార్యాలయంతో పాటు, మరో రెండు భవనాలను కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయాల్సి ఉంది. కానీ, పొడిగింపు వెసులుబాటును పలుమార్లు ఉపయోగించుకుంది ఆ పార్టీ. అలాగే 2020లో లోధి రోడ్డులోని బంగ్లాను నెల రోజుల్లో ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి నోటీసులు పంపారు అధికారులు.

Related Posts