YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నిర్బందాలతో ఉద్యమాలను అపలేరు బీజేపీ నేతల అరెస్టులు , పోలీసు స్టేషన్ లో నిర్బంధం

నిర్బందాలతో ఉద్యమాలను అపలేరు   బీజేపీ నేతల అరెస్టులు , పోలీసు స్టేషన్ లో నిర్బంధం

జగిత్యాల ఫిబ్రవరి 15,
రాజ్యాంగాన్ని మార్చాలని అన్నటువంటి కేసిఆర్ మాటలకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో తల పెట్టిన బీజేపీ, బీజేవైఎం మహ ర్యాలీ కార్యక్రమానికి వెళ్ళతున్న కోరుట్ల ,మెట్ పెల్లి బీజేపీ,బీజేవైఎం నాయకులకు
పోలీసులు ముందస్తు అక్రమంగా అరెస్టు చేసి కోరుట్ల ,మెట్ పెల్లి  స్టేషన్ లకు తరలించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ, బీజేవైఎం నాయకులకు ముందస్తు  అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లకు తరలించడం తెరస నియంతృత్వ పాలన కు నిదర్శనం ఆన్నారు. రాష్ట్రంలో నిజాం పరిపాలన నడుస్తోందని ప్రశ్నించిన నాయకులని అక్రమ అరెస్టు చేయాలని చూస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ధర్నాలు, ఉద్యోమాలు చేస్తే తెరాస ప్రభుత్వం అక్రమ నిర్బందాలతో ఉద్యమాలను,ఉద్యమ కారులను అపలేరని బీజేపీ నాయకులు ఆన్నారు.
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఆన్నారు. ఈ అరెస్టు లలో కోరుట్ల ,మెట్ పెల్లి బీజేపీ ,బీజేవైఎం నాయకులు చిరుమల్ల ధనుంజయ్ ,సుధావేణి మహేష్,కౌన్సిలర్ మాడవేణి నరేష్ ,దాసరి రాజశేఖర్, పోతుగట్టి శ్రీనివాస్, రాజమురళి,గిన్నెల ఆశోక్,సాడిగే మహేష్, ఠాకూర్ ప్రవీణ్ సింగ్ ,గోనెల రాజ శేఖర్, సాయికృష్ణా , బోడ్ల రమేష్, దొనికేల నవీన్,  ఇల్లెందుల శ్రీనివాస్, సుఖేందర్ గౌడ్, శ్రీరామ్ శివ గౌడ్, సదాశివ్ కోయ్యల లక్ష్మణ్  రాజ్ పాల్ రెడ్డి భోగ గంగాధర్ సాగర్, ఆర్మూర్ రంజిత్, సుంకేటి విజయ్, రమేష్ యాదవ్ ,అరిగెల అజయ్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడుసుంకే అశోక్ కలికోట శ్రీకాంత్, కుడుకల రఘు ,బోడ్ల గౌతమ్, యమ వినోద్, పసునూరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts