YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నకిలీ విత్తనాలపై అప్రమత్తం : సీఎం చంద్రబాబు

నకిలీ విత్తనాలపై అప్రమత్తం : సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నాడు  అధికారులతో నీరు – ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లాల కలెక్టర్లు, అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పిడుగుల సమాచారం ముందే వస్తున్నా ప్రాణనష్టం జరగడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగుపాట్ల సమాచారం మరింతగా విశ్లేషించాలన్నారు. అలాగే ఆధునిక సాంకేతికతతో అధ్యయనం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.  ఉద్యమస్ఫూర్తితో చేపట్టిన జల సంరక్షణ పనులు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.  కేంద్రంతో విభేదించినా తమిళనాడు, కేరళ అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయని, మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలన్నారు. వర్షపాతం లోటు ఉన్నా సాగునీటిని ఇవ్వగలిగామని ఆయన చెప్పారు. విత్తనాలు, ఎరువులు, రుణాలు కొరత లేకుండా అందించాలని ఆయన సూచించారు. నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. రైతులను మోసగిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గుజరాత్నుంచి అనుమతి లేని పత్తి విత్తనాలు వస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండి రైతుల్లో అవగాహన పెంచాలని ఆయన సూచించారు. అలాగే,  ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఒడిఎఫ్) ప్లస్ పనులకు అన్ని జిల్లాలు సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మరొక 8 వేల మరుగుదొడ్ల నిర్మాణంతో 100 శాతం ఓడిఎఫ్ పూర్తవుతుందని ఆయన అన్నారు. దీనికోసం కేటాయించిన 900 కోట్ల రూపాయిల నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. వ్యవసాయ పనులు ప్రస్తుతం లేనందున ఉపాధి పనులు ముమ్మరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రోజువారీ కూలీల హాజరు 23 లక్షలకు చేరాలని, గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యేలోపు నరేగా గరిష్టంగా జరగాలని ఆయన అన్నారు. ఈ నెలలో 1000 కోట్ల రూపాయిల విలువైన నరేగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

Related Posts