YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బాలికకు అండగా కేటీఆర్

బాలికకు అండగా కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 15,
మరోసారి మంచి మనసు చాటుకున్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పేదరికం కారణంగా ఉన్నత విద్య భారంగా మారిన, ఇద్దరు బాలికలకు ఆర్థిక సాయం అందించారు మంత్రి. విద్యా, వైద్యం విషయంలో సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు మంత్రి కేటీఆర్. తాజాగా విద్యకోసం మరో ఇద్దరు బాలికలకు సాయం చేశారాయన. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన చెందిన ఆవునూరి అఖిల తండ్రి ప్రభాకర్ ఒక రైతు, తల్లి గృహిణి. అఖిల ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులతో పాసై, ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్న అఖిలకు ఫీజులు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. అఖిల విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. చెప్పినట్టుగానే ఫీజుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన అఖిల కుటుంబంతో మాట్లాడి భరోసా ఇచ్చారు యంగ్‌ లీడర్.అటు భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. టిఆర్‌ఆర్ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. కానీ స్పందన తల్లిదండ్రులు రోజువారి కూలీలు. దీంతో ఇబ్బందులు తప్పలేదు. దీంతో స్పందన చదువులకు కూడా అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. స్పందన MBBS చదవడానికి అవసరమైన ఆర్థిక సాయం చేశారు. ఈ ఇరువురు విద్యార్థినులతో, వారి కుటుంబాలతో మాట్లాడిన మంత్రి కేటీఆర్, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో, పట్టుదలతో విజయం సాధించాలని విద్యార్థునులను ప్రోత్సహించారు ఐటీ మంత్రి. అటు మంత్రి కేటీఆర్‌ సాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు విద్యార్థునుల తల్లిదండ్రులు. కష్టాల్లో ఉన్న తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు.

Related Posts