YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ

వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి తలసాని

వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్
 తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 మెన్, 10 ఉమెన్ జట్లు ఈ  పోటీల్లో పాల్గొంటున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  పోటీలను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ  భారత్ లో క్రీడాకారులకి సరైన ప్రోత్సాహకం లభించట్లేదు. ఇది మన దురదృష్టకరం.  ఇలాంటి పరిస్థితులు మారాలి.  తెలంగాణ ఏర్పడ్డాక క్రీడలకు పెద్దపీట వేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.  సరికొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చేదుకు స్పోర్ట్స్ మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశారు.  త్వరలోనే స్పోర్ట్స్ పాలిసీ ని తీసుకొస్తున్నాం.  గ్రామీణ క్రీడల్ని గౌరవిస్తూ... వాటికి మరింత ప్రోత్సహం అందయించాల్సిన అవసరం ఉంది.  గెలుపోటములకు అతీతంగా అందరూ క్రీడాస్ఫూర్తి తో ఆడాలి.  ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో విన్నర్స్, రన్నర్స్ కి ట్రోఫీ లతో పాటు క్యాష్ అవార్డ్స్ అందించడం గర్వించదగ్గ విషయం.  విజేతలకు నా తరపున లక్ష రూపాయల్ని అందిస్తానని అన్నారు.

Related Posts