కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ తారకరామా కాలనీలో పోలీపులు సారా కార్యకలాపాలపై విస్తృత తనిఖీలు మంగళవారం తెల్లవారుజామున నిర్వహించారు. మండపేట రూరల్ సీఐ శివగణేష్, ఆలమూరు ఎస్సై శివప్రసాద్ ఈ తనిఖీల్లో పాల్గోన్నారు. సిఐ శివగణేష్ మాట్లాడుతూ సారా నిల్వలు కలిగిఉన్నా, అమ్మినా అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో "పరివర్తన" కార్యక్రమం రెండు పర్యాయాలు నిర్వహించామని అయినా మార్పు రాకపోతే చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు. అయితే ఇంటింటి సర్వే నిర్వహించినా ఈ ప్రాంతంలో ఎటువంటి సారా లభ్యం కాలేదని అన్నారు. ఈ తనిఖీల్లో ఆలమూరు ఎస్ఈబి సీఐ కేదారి శ్రీధర్ తో పాటుగా ఆలమూరు పోలిస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.