YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సుజాతనగర్ లో రైతు బంధు

సుజాతనగర్ లో రైతు బంధు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ రెవెన్యూ గ్రామంలో 1958 మంది రైతులకు రైతు బందు  చెక్కులను 4 కౌంటర్ల ఏర్పాటు ద్వారా అందించేలా చర్యలు చేపట్టారు.చెక్కుల పంపిణీ కేంద్రాల వద్ద   టెంట్లు,నీటి సౌకర్యం ,ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసారు.ఎకరాకు సంవత్సరానికి 8 వేలు,ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబందు పధకం, సీఎం కేసీఆర్ తన మేధస్సు ను ఉపయోగించి  చేపట్టిన భూరికార్డుల  శుద్ధీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు, పంట పెట్టుబడి సాయం అందించటం పట్ల రైతులు  తమ హర్షం వ్యక్తం చేస్తున్నారని,1954 నుండి చనిపోయిన వారి పేర్లు ఇప్పటికి కొనసాగుతున్న పరిస్థితి, భూ అమ్మకాలు జరిగి కొనుగోలు దారు పేరు రికార్డులో లేక పోవటం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు, నేడు వివిధ రకాల భూముల వివరాలు వెలుగులోకి 

ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈనెల 10 వ తారీకు నుండి తెలంగాణ పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నదని, రైతన్నలు సంతోషంగా ఉన్నారు. మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలే కాకుండా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు సైతం చేపడుతున్నారని వివరించారు. రైతులకు 24 గంటల ఉచిత  నాణ్యమైన విద్యుత్ , గోడౌన్ నిర్మాణం,5 లక్షల ఇన్సూరెన్స్ సహాయం వంటి పథకాలు దేశవ్యాప్తంగా పలు ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీలు చేయని సాహస వంతమైన కార్యక్రమాలు తీసుకున్నారు.దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ పథకాలు ఆదర్శంగా నిలుస్తన్నాయన్నారు.90 రోజుల చెక్కులు మార్చు కునే సౌకర్యం ఉన్నదని, విత్తనాలు, ఎరువులు, దుక్కులకు ఈ సహాయాన్ని ఉపయోగించు కోవాలని సూచించారు. నోట్లు సమస్య కలగకుండా 1500 కోట్లు విమానం ద్వార తెప్పించిన ఘనత సీఎం కెసీర్ కు దక్కిందని అన్నారు. రైతులందరి కి డబ్బులు అందేలా చర్యలు తీసుకున్నారు.

ఎమ్మెల్యే జలగం వెంకట రావు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలు గా సుజాత నగర్ మండలం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు  రోడ్లు,రాఘవాపురం గ్రామంలో గోడౌన్,విద్యుత్ సబ్ స్టేషన్ బృందావనం వద్ద,మండలం ఏర్పాటు, led వీధి దీపాలు, అయిల్ పామ్10 వేల ఎకరాలను సాగు చేసేలా రైతు సమన్వయ సమితి సభ్యులు కృషి చేయాలని, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ గ్రూపుల ఏర్పాటు చేసి రైతులు పండించిన టమాటాలు ప్రాసెసింగ్ యూనిట్ తీసుకుని రావటానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సింగభూపాలెం చెరువు అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేప పిల్లలు తో పాటు,రోయ్య పిల్లల్ని చెరువుల లో వదిలాము మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ లక్ష్యం .అగ్రికల్చర్, హార్టికల్చర్, వ్యవసాయ శాఖ వారి సూచనలు పాటించి రైతులు ఎకరాకు 50 వేల రూపాయలు సంపాదించేలా వ్యవసాయం చేయాలని కోరారు. పట్టాదారు పాసు పుస్తకం లో రైతు పెరు, తల్లీ దండ్రులు వివరాలు, సర్వే నెంబర్లు ప్రకారం వారికున్న కమతాల వివరాలు,ఖాతా వివరాలు ఉంటాయి. పాస్ బుక్ లో మార్పులు చెయించాల్సి ఉంటే చేయించు కోగలరని సూచించారు.

Related Posts