హైదరాబాద్, ఫిబ్రవరి 15,
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీపీసీసీకి అధ్యక్షుడిగా నిమామకమైన తరువాత మొదటి సారి మంగళవారం రేవంత్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామన్న వాతావరణం సృష్టించేందుకే కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను గందరగోళంలో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.అంతేకాకుండా కేసీఆర్ మోడీ కోవర్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ భాగస్వామ్య పార్టీలను కేసీఆర్ చిల్చే ప్రయత్నం చేస్తున్నారని, మోడీ కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. థర్డ్ ఫ్రంట్ కాదు సుఫారీ గ్యాంగ్ అంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎప్పటికీ కలవబోవని ఆయన స్పష్టం చేశారు. మీ బర్త్‌డేకు ముందు ఉద్యోగ నోటిఫికేసన్లు ఇవ్వండని ఆయన అన్నారు.