న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇక, తాజాగా, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ కాంగ్రెస్‌ను వీడారు.. ఇవాళ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన ఆయన.. రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.. కాంగ్రెస్ పార్టీని వీడాలనే నిర్ణయం బాధాకరమని రాసుకొచ్చారు. కాగా, పంజాబ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న అశ్వనీకుమార్.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పార్టీకి గుడ్‌బై చెప్పడం పెద్ద చర్చగా మారింది.కాగా, పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో.. ఎప్పటి నుంచో అంతర్గత కలహాలను నడుస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి, సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి అశ్వనీకుమార్ పార్టీని వీడడం.. కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే అంటున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది.. 2020లో జీ-23 గ్రూప్ పార్టీని సమూలంగా మార్పులు చేయాలని సోనియాకు లేఖ రాయగా.. ఆయన సీనియర్ నేతలను సమర్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు సైతం సన్నిహితుడు పేరు పొందారు.. ఆయన తండ్రి ప్రబోధ్ చంద్ర స్వాతంత్య్ర సమర యోధులు.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి, స్పీకర్‌గా పని చేశారు. అశ్వనీకుమార్ 2002లో రాజ్యసభకు ఎన్నికవగా.. 2016 వరకు కొనసాగారు. యూపీఏ సర్కార్‌లో మంత్రిగా పనిచేశారు.