YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీ కాంగ్రెస్ లో ఫిర్యాదుల పర్వం

టీ కాంగ్రెస్ లో ఫిర్యాదుల పర్వం

హైదరాబాద్, ఫిబ్రవరి 16
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫిర్యాదులు కామన్ అయిపోయాయా? రోజుకో కంప్లయింట్‌ పీసీసీకి తలనొప్పిగా మారిందా? హైకమాండ్‌కు వివరణ ఇవ్వటానికే టైమ్‌ సరిపోతోందా? వరస ఫిర్యాదులపై అధిష్ఠానం ఏం చేయబోతుంది? తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రధాన శత్రువులు ఎక్కడో ఉండరు. సొంత పార్టీలోని నాయకులే.. పార్టీ నేతను కట్టడి చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు అయితే.. ఓకే..! లేదంటే హైకమాండ్‌కు ఫిర్యాదులు కామన్. ఇది కాంగ్రెస్‌లో సర్వసాధారణం. అందుకే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు. ఈ తీరే పార్టీకి తలనొప్పిగా మారిందట. అసలు పనిని పక్కనపెట్టి నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌పై వరసపెట్టి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతి సమస్యపై ఎఐసిసికి లేఖలు రాసిపడేస్తున్నారట. ఈ విషయంలో సీనియర్లు.. జూనియర్లు అనే తేడా లేదట. సమస్య వచ్చిందా వెంటనే లెటర్‌ హెడ్‌ తీసుకుని కాపీ టు సోనియా కాపీ టు రాహుల్‌ గాంధీ అని లేఖలు వెళ్లిపోతున్నాయట.ఇటీవల పీసీసీ మాజీ చీఫ్ హన్మంతరావు ఎఐసిసికి లేఖ రాశారు. పార్టీ కార్యక్రమాల కోసం మంచిర్యాల వెళ్తే.. తనపై దాడి జరిగిందని.. ఆ విషయంలో పీసీసీ స్పందించిన తీరును ప్రస్తావిస్తూ హైకమాండ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న సమస్యలపై చర్చించేందుకు పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీని సమావేశ పర్చాలని ఆ లేఖలో కోరారు వీహెచ్‌. ఇక వరంగల్‌ ఎపిసోడ్‌లో.. తనకు వెస్ట్‌ సీటు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని జంగా రాఘవ చెప్పారు. దాంతో పీసీసీ బుజ్జగించాల్సి వచ్చింది. దీంతో వరంగల్‌ డీసీసీ రాజేందర్‌రెడ్డి అలకబూనారు. నేరుగా వెళ్లి VHతో తన సమస్య చెప్పుకొన్నారట రాజేందర్‌రెడ్డి. 2018 ఎన్నికల్లోనే తనకు వరంగల్ వెస్ట్ టికెట్ ఇవ్వకుండా.. ఇప్పుడు మరొకరికి ఎలా హామీ ఇస్తారని నిలదీశారట రాజేందర్‌రెడ్డి. అదే విషయాన్ని పీసీసీకి చెప్పడంతోపాటు ఎఐసిసికి లేఖ రాశారట.తాజాగా మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత.. పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య సైతం అదే దారిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జనగామలో తనకు రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పొన్నాల అనుమానిస్తున్నారట. జంగా రాఘవతోపాటు.. పీసీసీ చీఫ్‌కు సన్నిహితంగా ఉండే నేతను జనగామలో ప్రోత్సహిస్తున్నారనే ఆవేదనలో ఆయన ఉన్నారట. అదే విషయాన్ని ఎఐసిసి పెద్దలకు.. స్థానిక బీసీ నాయకులకు చెప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. జంగా రాఘవకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకుండా.. పార్టీ ఎందుకు తాత్సారం చేస్తుందనే సందేహంలో ఉన్నారు పొన్నాల.ఇలా రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి రోజుకో ఫిర్యాదు వెళ్తోంది. పార్టీలో ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా లేఖలు ఢిల్లీకి సంధించారట. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒకరు ఘాటుగానే పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల కంటే.. పీసీసీ చీఫ్ వ్యక్తిగత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ లేఖలో ప్రస్తావించారట. ఇలాంటి లేఖలకు వివరణ ఇచ్చుకోవడానికే ఎక్కువ సమయం పోతోందట. వాటి గురించే కథలు కథలుగా చెప్పుకొంటున్నాయి గాంధీభవన్‌ వర్గాలు

Related Posts