డిజె టిల్లు' పాటలోని సాహిత్యం లాగానే ఇవాళ బాక్సాఫీసు బాక్సులు పగులుతున్నాయి. రోజు రోజుకీ చిత్రం సాధిస్తున్న కలెక్షన్స్ భారీ విజయంగా నమోదు చేస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ఈ డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. గత శుక్రవారం విడుదలయిన ‘డిజె టిల్లు’ అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చిత్రం సాధించిన విజయాన్ని, ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో కలసి పంచుకునే దశలో హీరో సిద్దు జొన్నలగడ్డ, నాయిక నేహా శెట్టి, దర్శకుడు విమల్ కృష్ణ ల రెండవ రోజు (15-2-22) పర్యటన ఇలా సాగింది. ఈరోజు ఉదయం విజయవాడ లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న చిత్ర బృందం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు లోని విజయలక్ష్మి , కొవ్వూరు లోని వై స్క్రీన్స్ , రాజమండ్రి లోని శ్యామల ధియేటర్ లలో చిత్ర బృందం సందడి చేసి, ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. టిల్లు టీం కు థియేటర్ లో ప్రేక్షకులు మరింత ఉత్సాహాన్ని అందించారు. తమ ముందుకు వచ్చిన టిల్లును చూసి కేరింతలు కొట్టారు... ప్రేక్షకులు టిల్లు టిల్లు అంటే చేసే నినాదాలు ధియేటర్స్ లో ప్రతిధ్వనిoచాయి. థియేటర్స్ లో ప్రేక్షకులతో కలసి చూసిన హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహా శెట్టి, దర్శకుడు విమల్ కృష్ణ స్పందనలు ఇలా సాగాయి.
హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..'డిజె టిల్లు సక్సెస్ మీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆనందం చూసి కడుపు నిండిపోయింది. ఇక రాధిక తో నేను పడుతున్న పాట్లు చూసారుగా మిమ్మల్ని ఏడిపించేంతవరకూ నవ్వించాలి అనుకున్నాం అది ఇప్పడు చూస్తున్నాం.. చాలా ఆనందంగా ఉంది. టిల్లు గాడు మిమ్మల్ని ఆనంద పెట్టేందుకే ఇకపై కూడా ప్రయత్నిస్తుంటాడు.. అన్నారు.. డిజె టిల్లు టైటిల్ సాంగ్ కి స్టెప్స్ వేసి ప్రేక్షకుల్ని అలరించారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ..'రాధిక మీకు నచ్చిందా..? (ప్రేక్షకుల నుండి చాలా అంటూ రెస్పాన్స్ వచ్చింది) థాంక్యూ .. నేను మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.. ఇంత రెస్పాన్స్ ని నేను ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు. చాలా ఆనందంగా ఉంది.. టిల్లు తో కలసి మిమ్మల్ని నేరుగా కలుసుకోవడం చాలా ఆనందగా ఉంది.. డిజె టిల్లు చిత్రం నా కెరియర్ లో బెస్ట్ గా నిలుస్తుంది అన్నారు.
దర్శకుడు విమల్ మాట్లాడుతూ..'ఆడియన్స్ కి చాలా థ్యాంక్స్.. మీకు టిల్లు క్యారెక్టర్ ఎంతగా నచ్చిందో మీ కేరింతలు చెబుతున్నాయి .
టిల్లు కి మీరు ఇస్తున్న రెస్పాన్స్ నా జీవితంలో మర్చిపోలేను. ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ అన్నారు. 'డిజె టిల్లు' విజయ యాత్ర ప్రేక్షకుల కేరింతలతో మారు మ్రోగింది. టిల్లు కి అడుగడుగునా బ్రహ్మరధం పట్టారు ప్రేక్షకులు. ప్రేక్షకుల అభిమానాన్ని గుండెల నిండా నింపుకున్న చిత్ర బృందం ఉత్తరాంధ్ర వైపు ప్రయాణం మొదలు పెట్టింది. రేపు (16-2-22)అక్కడి ధియేటర్లలోనూ, సాయంత్రం వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రం లో జరిగే సక్సెస్ మీట్ లోనూ ప్రేక్షకాభిమానుల సమక్షంలో మరోమారు తమ సంతోషాన్ని పంచుకోనుంది చిత్ర బృందం.