YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భూవివాదాలు వుండవు : ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ

భూవివాదాలు వుండవు : ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ

కొమురంభీం జిల్లా అసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో రైతుబంధు కార్యక్రమంలో భాగంగా చెక్కులు, పట్టా పాసు పుస్తకాలు లబ్దిదారులకు సబ్సిడీ ట్రాక్టర్లు ను డిప్యూటీ సిఎం మహమూద్ అలీ పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు నెలల్లోనే భూ ప్రక్షాళన పూర్తి చేసి 94 శాతం భూ వివాదాలను పరిష్కరించి దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారన్నారు. పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్,టిడిపి, హయాంలో రైతులను ఏనాడు ఆదుకోలేదు, నేడు రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్ లు, 24 గంటల విద్యుత్, సాగునీరు,అందిస్తూ రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తు  దేశంలోనే అందరికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిల్చిందన్నారు. 

ఐదు శాతం భూ వివాదాలు మిగిలి ఉన్నాయి.  రాబోయే రోజుల్లో వందశాతం  భూ వివాదాలు పరిష్కరించి భూ వివాదాలు లేని రాష్ట్రoగా తీర్చి దిద్దుతామని తెలిపారు. 

మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల 5 వందల 56 గ్రామాల్లో వెయ్యి 7 టీం లతో559 మండలాల్లో సర్వే చేసి ఒక కోటి 42 లక్షల,భూ వివాదాలు లేని భూమిగా లెక్క తేల్చి58 లక్షల మంది రైతులకు5 వేల730 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తున్నాము అన్నారు. రైతు బంధు పథకంలో ఇచ్చిన చెక్కుల ను రైతులు నగదుగా మార్చుకోవడానికి బ్యాంకుల్లో నగదు కొరత, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన్నట్లు తెలిపారు. కొమురం భీం జిల్లా ను వ్యవసాయ రంగం లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం స్పెషల్ కోటా కిందా  డ్రిప్ ఇరిగేషన్ ,కేవీకే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భూ రికార్డు ల ప్రక్షాళన ను పగఢ్భంది గా పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి జోగు రామన్న , ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్,ఎమ్మెల్యే కోవ లక్ష్మీ పాల్గొన్నారు.

Related Posts