YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మందుబాబులూ జాగ్రత్త...

మందుబాబులూ జాగ్రత్త...

హైదరాబాద్ ఫిబ్రవరి 16
మందుబాబులూ  జాగ్రత్త...మద్యం తాగిన వారిలో సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయట. ఇటీవల చేసిన కొన్ని పరిశోధనల ప్రకారం ఈ విషయం వెల్లడైంది.అదేపనిగా మద్యం అలవాటు చేసుకొని దానికి బానిసగా మారిన వాళ్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ఆ పరిశోధనలు తెలుపుతున్నాయి. మద్రాసులోని చెన్నైలో చేసిన తాజా పరిశోధనల్లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. మగవాళ్లలో సంతానం కలగకపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా మద్యం తాగే వాళ్లను పరిశీలించారు. అయితే సాధారణ వ్యక్తుల కంటే మద్యం తాగే వాళ్లలో వీర్య కణాల ఉత్పత్తి విపరీతంగా తగ్గుతున్నట్లు వారు కనుగొన్నారు. ఆ పరిశోధన వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
చాలా మంది సంతానం కలగకపోవడానికి ఎక్కువగా ఆడవాళ్లను నిందిస్తుంటారు. కానీ చెన్నైలో చేసిన పరిశోధనల ఫలితాలు చూసి షాక్ తింటున్నారు. సంతానం లేకపోవడానికి మొగవాళ్లలోనూ అనేక కారణాలున్నట్లు గుర్తించారు. ఇందులో మద్యం అధికంగా తాగేవారిలో ఈ సమస్య ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ పరిశోధనల ప్రకారం.. దేశంలో 3.9 నుంచి 16.9 శాతం సంతాన లేమి ఉన్నట్లు తేలింది. ఇందులో తమిళనాడులోనూ ఈ తరమా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెట్టినాడు అకాడమీ ఆప్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ చెట్టినాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఓ పరిశోధన బృందం కీలక సమస్యపై దృష్టి పెట్టింది.  సంతాన సమ్యలో భాగంగా మందుబాబులపై ప్రయోగాలు చేసింది.
సంతాన లేమితో ఆసుపత్రికి వచ్చిన 231 మంది మందుబాబులను ఈపరిశోధనలోకి తీసుకున్నారు. వీరిని    సంవత్సరం పాటు పరిశీలించారు. వీరిలో 81 మంది మద్యం తాగేవారిని ఈ అలవాటు లోని మిగతా వారిని తీసుకున్ారు. ఈ రెండు వర్గాల వరాకి డబ్ల్లూహెచ్వో ప్రమాణాల ప్రకారం సీమెన్ స్పెర్మ్ పరీక్షలు నిర్వహించారు. వచ్చిన ఫలితాలపై మరోసారి పరిశోధన చేశారు. వీరు తెలుసుకున్న ప్రకారం మద్యం అలవాటు లేనివారిలో కంటే మద్యం తాగేవారిలో ఫలితాలు దారుణంగా ఉన్నటట్లు కనుగొన్నారు. మద్యం తాగేవారిలో వీర్యకణాలు బాగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో వీర్య కణాల వృద్ధి వాటి సంఖ్య చలనశీలతలు బాగా తగ్గిపోయాయని గుర్తించారు.అయితే ఎందుకిలా జరుగుతుందని గత పరిశోధనలు పరిశీలించారు. టెస్టోస్టిరాస్ హార్మోన్లను విడుదల చేసే వృషణంలోని లెడిగ్ కణాలపై అల్కహాల్ ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వీర్యం విడుదలయ్యే లూటీనైజింగ్ హార్మోన్ పొలికల్ స్టిమ్యూలేటింగ్ హార్మోన్ పై అల్కహాల్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. అయితే రెండు వర్గాలను పరిశీలిస్తే మద్యం తాగేవారిలో ఈ ప్రభావం అధికంగా ఉండడంతో ఈ  సమస్యకు అల్కహాలే కారణమని గుర్తించారు.
పరిశోధనకు తీసుకున్న వారిలో 21 నుంచి 52 ఏళ్ల వయసు మగవాళ్లు ఉన్నారు. వీరంతా పెళ్లయిన వారే ప్రధానంగా 31 నుంచి 40 ఏళ్ల వారు మితిమీరిన మద్యం తీసుకున్నట్లు గుర్తించారు. రకరకాల మద్యం తాగుతూ మానసికంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని ఆలస్యంగా గుర్తించారు.పరిశోధనలో పాల్గొన్న 81 మంిలో మద్యం తాగేవారిలో 36 మంది ప్రతిరోజు తప్పనిసరిగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. వీరిని నిశితంగా పరీక్షించగా వీరిలో వీర్యకణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రభావం సంతాన లేమికి కారణమవుతుందని అంటున్నారు. అయితే మద్యానికి బానిసలుగా మారిన వాళ్లు తమ కుటుంబ సమస్యలను కొని తెచ్చుకోవడమేనని అంటున్నారు. ఇప్పటికైనా మద్యం అతిగా అలవాటు ఉన్నవాళ్లను కొద్ది కొద్దిగా మాన్పిస్తే కాస్త ఫలితం ఉండొచ్చని అంటున్నారు.

Related Posts