హైదరాబాద్ ఫిబ్రవరి 16
అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతలు 709 పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు అసోం సీఎంపై ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించారనే ఆరోపణల కింద కేసులను చేర్చారు.
అసోం సీఎంపై కేసు నమోదుపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 709 పోలీసు స్టేషన్లలో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఫిర్యాదులు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు బదిలీ అవుతాయి. ప్రతీ పోలీసు స్టేషన్‌లో జీడీ ఎంట్రీ చేసుకుని జూబ్లీహిల్స్ పీఎస్‌కు బదిలీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఉన్న కేసునే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.