YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

నెలకు 4 వేల కోట్ల మద్యం ఆదాయం

నెలకు 4 వేల కోట్ల మద్యం ఆదాయం

హైదరాబాద్, ఫిబ్రవరి 17,
పెళ్లి అయినా.. చావైనా.. ఏదైనా ప్రస్తుతం మందు ఉండాల్సిందే. రాష్ట్రాలకు వస్తున్న ఆదాయంలో ఎక్కువగా ఎక్సైజ్ శాఖ నుంచి మధ్యం విక్రయాల నుంచే వస్తోంది. రాష్ట్రాలు ప్రధాన ఆదాయంగా మద్యాన్ని చూస్తున్నాయి. మరోవైపు మందుబాబులు ‘తగ్గేదే లే’ అన్న రీతిలో మధ్యాన్ని హాంఫట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత 10 నెలల్లో వచ్చిన ఆదాయాన్ని చూస్తే ఎవరికైనా దిమ్మతిరుగుతుంది. అంతలా మద్యాన్ని తాగి రాష్ట్రాలకు ఆదాయాన్ని సమకూర్చారు మందు బాబులుతెలుగు రాష్ట్రాల్లో గత 10 నెలల్లో మందుబాబులు రూ. 47 వేల కోట్ల విలువైన మద్యాన్ని తాగారు. తెలంగాణలో రూ.25,238 కోట్ల విలువైన 3.07 కోట్ల కేసుల లిక్కర్ , 2.71 కోట్ల కేసుల బీరు అమ్ముడైంది. ఏపీలో రూ. 21,169 కోట్ల విలువైన 2.13 కోట్ల కేసుల లిక్కర్, 62.90 లక్షల కేసుల బీరు విక్రయం జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.10 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయే అవకాశం ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు.

Related Posts