తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ 68 వ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ శాఖ అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా తెరాస కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు హాజరై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారని కొనియాడారు.. ముఖ్యమంత్రి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ మైనారిటీ నాయకులు ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని హజరత్ జమేదార్ బాబా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు పట్టడం జరిగిందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్ , టిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, టిఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఆన్సర్, ఎండి సాజిద్ , ఎండి అహ్మద్, షబ్బీర్, సయ్యద్ జావిద్, నిసార్, ఎండి తాజ్, అమర్ బిన్ అబ్దుల్లా, శౌకత్ అలీ, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సాయిబాబా టెంపుల్ తో పాటు దుర్గాదేవి టెంపుల్ లో టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గారు ప్రత్యేక పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు... అలాగే మియావాకి ప్లాంటేషన్ లో సీఎం కేసీఆర్ నామకరణం తో మొక్కలను నాటి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేసి నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ వనరులు కాపాడుకుంటు తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.. సర్వ మతాలను సర్వ కులాలకు సర్వ మతాలను ఏకతాటిపై తీసుకొస్తూ భిన్నత్వంలో ఏకత్వం పాలన కొనసాగిస్తున్నరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రతి గడప గడపకు చేరుతున్నా అన్నారు.. పొరుగు రాష్ట్రాలలో సైతం సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా చేసుకోవడం చూస్తున్నామన్నారు. సీఎం కెసిఆర్ మూడురోజుల పుట్టినరోజు వేడుకల్లో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది అన్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ లో కెసిఆర్ జన్మదినం పురస్కరించుకొని టిఆర్ఎస్ శ్రేణులు సర్వమత సామరస్యం గా ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు టెంపుల్స్, మసీద్, ప్రార్థన మందిరాలు అందుకు ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి కెసిఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమాల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.