YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎం కేసీఆర్ ను విమర్శించడం దారుణం మంత్రి శ్రీనివాస్ గౌడ్

సీఎం కేసీఆర్ ను విమర్శించడం దారుణం మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా  కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ .మొక్కలు నాటి, కేక్ కట్ చేసారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు అన్ని వర్గాల ప్రజలు.. ఉద్యోగులూ స్వచఛందంగా ఘనంగా జరిపారు. ఇది చూసి ఓర్వలేక రెండు జాతీయ పార్టీల నేతలు సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాందీ గురించి అస్సాం సీఎం మాట్లాడితే.. సీఎం కేసీఆర్ స్పందించే దాకా కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించ లేదు. స్పందించిన సీఎం కేసీఆర్ పై నీచంగా ప్రవర్తించడం దారుణమని అన్నారు.  రాజీవ్ గాంధీ.. ఇందిరా గాంధీ ల గురించి సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పారు.. మరి అలాంటి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పడం.. గాడిద పై ఉరెగిస్తం అనడం దారుణం. ము పిలుపు ఇస్తే ఇలాంటి కార్యక్రమాలు క్షణాల్లో జరుగుతాయి.. కానీ మేము మీలా చేయం.. మా నేత పేదలకు అండగా ఉందాం అంటారు కానీ.. ఇలా నీచంగా చేయమని చెప్పరు.. ఇక సీఎం ను పట్టుకుని ఇలా వ్యవహరిస్తారా..  ఓ వ్యక్తిని తన తండ్రి గురించి నీచంగా మాట్లాడితే.. ఎవరూ సహించరు..  దీన్ని ఓ బీజేపీ జాతీయ నాయకురాలు కూడా సమర్టిస్తే.. మీరు ఏమీ చేయలేదు.. అస్సాం సీఎం వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ కండిస్తే.. ఆయనను అవమాన కరంగా చేయడం ఏంటి. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ ను జాతీయ నాయకత్వం వహించాలని కోరుతున్నారు.. ఇది గిట్టక మీరు ఇంతలా ప్రవర్తిస్తున్నారు.  సిఎం కేసీఆర్ ను విమర్శించే తీరు మార్చుకోకుంటే.. ప్రజలు గుణపాఠం చెప్పటం ఖాయమని అయన అన్నారు.

Related Posts