ఇబ్రహీంపట్నం
యూత్ కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాడిదకు టీ ఆర్ ఎస్ కండువా కప్పి, కేసీఆర్ బర్త్డే చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రంలో గాడిద పాలన నడుస్తోంది కాబట్టి గాడిదకు కండువా కప్పి , కే సి ఆర్ చిత్రపటం వేసి కేక్ తినిపించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ చిలుక మధు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వేడుకలు మూడు రోజుల నుండి జరపడం సిగ్గు చేటని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై అమరవీరుల స్థూపం సమీపంలో గాడిదకు టీ ఆర్ ఎస్ కండువా కప్పి, కేసీఆర్ ఫోటో వేసి కేక్ తినిపించి నిరసనగా బర్త్డే ను జరిపి వినూత్న రీతిలో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గాడిదల పాలన నడుస్తోందనీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రము వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, భృతి ఇస్తామన్న కేసీఆర్ తమ కుటుంబంలో ఉద్యోగాలు నింపుకొని ఈ రోజు గాడిదల పాలనా కొనసాగిస్తున్నారన్నారు. జిల్లా ఫ్లోర్ లీడర్ భూపతిగళ్ల మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా జన్మదిన వేడుకలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.