YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

జేఈఈ రెండు సార్లు

జేఈఈ రెండు సార్లు

ముంబై, ఫిబ్రవరి 17,
ఈ ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి హాజరయ్యే అభ్యర్థులకు ఎన్టీఏ కీలక ప్రకటన చేసింది. జేఈఈ మెయిన్‌ 2022 విద్యాసంవత్సరానికి గానూ మొత్తం నాలుగు ప్రయత్నాలకు బదులుగా రెండు సార్లు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  బుధవారం ప్రకటించింది. తాజా ప్రకటన మేరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్, మేలో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. గత ఏడాది మాత్రమే ప్రయత్నాల సంఖ్య 4కు పెరిగింది. సాధారణంగా ఐతే జేఈఈ పరీక్షలను ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహించేవారు. 2019లో ప్రయత్నాల సంఖ్యను రెండుకు పెంచగా, 2021లో అది నాలుగుగా మారింది. విద్యార్ధులు ఈ నాలుగు ప్రయత్నాల్లో సాధించిన ఉత్తమ స్కోరును ఫైనల్‌గా సబ్‌మిట్‌ చేసే అవకాశం కల్పించింది. ఏప్రిల్‌లో మాత్రమే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినందున, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కు నాలుగు ప్రయత్నాలకు బదులుగా రెండు సార్లు మాత్రమే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. గత ఏడాది కోవిడ్-19 కారణంగా 4 ప్రయత్నాలకు అవకాశం కల్పించామని, ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగుపడ్డాయి. అందువల్లనే రెండు సార్లు మాత్రమే జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెల్పింది. అంతేకాకుండా ఈ ఏడాది నిర్వహించవలసిన12వ తరగతి బోర్డు పరీక్షలతో పాటు ఇతర చాలా పరీక్షలు ఆలస్యం కావడం వల్ల, ఈ సంవత్సరం అడ్మిషన్లు సకాలంలో నిర్వహించాలనే ఉద్ధేశ్యంతో ప్రయత్నాల సంఖ్యలో మార్పులు చేసినట్లు పేర్కొంది.సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభంకానుండగా, కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ చివరి వారం నుంచి పరీక్షలను నిర్వహించడానికి హెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. ఇక నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) లేదా NEET-UG జూన్ మూడవ వారం నుంచి జూలై మొదటి వారం మధ్య నిర్వహించబడుతుంది. 2021లో దాదాపు 26 లక్షల మంది ఇంజినీరింగ్, మెడికల్ అనుబంధ ప్రోగ్రామ్‌ల అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా జేఈఈ మెయిన్ మల్టీ-సెషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష. టాప్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అడ్మిషన్ పొందడంతోపాటు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీకి ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కావాడానికి జేఈఈ మెయిన్‌ పరీక్షలకు విద్యార్ధులు హాజరవుతారు.

Related Posts