ముంబై ఫిబ్రవరి 17,
నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వున్న పిల్లల్ని మీ బండిపై తీసుకెళ్తున్నారా? అయితే ఇగో కొత్త రూల్స్ ఫాలో కావాల్సిందే. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల్ని బండిపై తీసుకెళితే కచ్చితంగా వారికి కచ్చితంగా హెల్మెట్ ధరింపజేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ తాజాగా నిబంధనలను జారీ చేసింది. అలాగే రక్షణ బెల్టు కూడా కచ్చితంగా ఉండాలని సూచించింది. ద్విచక్ర వాహనదారులకి ఇది గమనిక.. కేంద్రం మరో కొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ రూల్ ప్రకారం.. బైక్ పైన చిన్న పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది.. సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్, 1989కు సవరణ చేసి ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది కేంద్రం. కొత్త నిబంధన ప్రకారం ఎవరైనా నిబంధనలు ఉల్లగించితే రూ. 1,000 జరిమానా లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు.రాజకీయ వర్గాల్లో చర్చ అలాగే పిల్లవాడితో ప్రయాణించే ఏదైనా ద్విచక్ర వాహనం తప్పనిసరిగా గంటకు గరిష్టంగా 40-కిమీ వేగ పరిమితిలో ప్రయాణించాలి. పిల్లల కోసం కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఆదేశించింది కేంద్రం. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలకు భద్రత కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించింది... ఈ విషయంపై పౌరుల అభిప్రాయాన్ని అడగడానికి అక్టోబర్ 2021 లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందిఅలాగే నాలుగేళ్ల పిల్లవాడు బైక్ వెనకాల కూర్చుంటే 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని కూడా కేంద్రం నిబంధన విధిచింది. అంతకంటే ఎక్కువ వేగంగా వెళ్లకూడదని సూచించింది. ఈ నెల నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది.