YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీబీఐ వర్సెస్ వైసీపీ

 సీబీఐ వర్సెస్ వైసీపీ

కడప, ఫిబ్రవరి 18,
త‌ప్పు చేస్తారు. అరాచ‌కాల‌కు తెగ‌బ‌డుతారు. ఏదో ఒక‌రోజు పాపం పండుతుంది. కేసు న‌మోద‌వుతుంది. అధికార బ‌లంతో అడ్డుకోవాల‌ని చూస్తారు. విష‌యం కోర్టు కెళుతుంది. సీబీఐ విచార‌ణ మొద‌ల‌వుతుంది. ఇక అంతే.. త‌ప్పును వ‌దిలేసి.. ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో ఇలానే జ‌రిగింది. ఇప్పుడు వివేకా మ‌ర్డ‌ర్ ఎపిసోడ్‌లోనూ అదే స్ట్రాటజీ న‌డుస్తోంది. అప్ప‌ట్లో సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను టార్గెట్ చేయ‌గా.. ఇప్పుడు సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను కార్న‌ర్ చేస్తోంది జ‌గ‌న్ టీమ్‌. అవును, ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును డీల్ చేస్తున్న‌ సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పించడం ఆస‌క్తిక‌రంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌.. బాధితులనే నిందితులుగా చిత్రీకరించేందుకు దురుద్దేశపూరితం, ప్రేరేపితం, ముందే నిర్ణయించిన విధంగా చార్జ్‌షీట్‌ రూపొందించారంటూ స‌జ్జ‌ల మండిప‌డ్డారు. ప‌నిలో ప‌నిగా ఎప్ప‌టిలానే అల‌వాటులో పొర‌బాటుగా అందులోకి టీడీపీని కూడా లాగేశారు. వైసీపీని, ఎంపీ అవినాష్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ నేతలు ఇలా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంత‌కీ, స‌డెన్‌గా స‌జ్జ‌ల‌కు సీబీఐ ఎస్పీ మీద అంత‌కోపం ఎందుకు వ‌చ్చిందంటే.. త‌న ఎంపీ టికెట్‌కు అడ్డుప‌డుతున్నాడ‌నే కోపంతో.. వివేకా హ‌త్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి కుట్ర దాగుందంటూ ఆయ‌న‌ పేరును సీబీఐ చార్జిషీట్‌లో పొందుప‌ర‌చ‌డం జ‌గ‌న్‌కు, స‌జ్జ‌లకు న‌చ్చ‌న‌ట్టుంది. అందుకే, కేసు ద‌ర్యాప్తు చేస్తున్న ఎస్పీ రాంసింగ్‌పై నేరుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ విధంగా సీబీఐ అధికారిని బ‌య‌పెట్టాల‌ని చూశార‌ని అంటున్నారు. ఈ త‌ర‌హా పాలిటిక్స్ వైసీపీకి కొత్తేమీ కాద‌ని అంటున్నారు. వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తండ్రి ప‌ద‌విని అడ్డుపెట్టుకొని.. సూట్‌కేసు కంపెనీల‌తో వేల కోట్ల అక్ర‌మ సంపాద‌న పోగేశార‌ని జ‌గ‌న్‌రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. అప్ప‌ట్లో సీబీఐ జేడీగా ఉన్న‌ ల‌క్ష్మీనారాయ‌ణ ఆ కేసు విచార‌ణ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప‌క్కా ఆధారాల‌తో బ‌ల‌మైన ఛార్జిషీట్లు న‌మోదు చేశారు. రెండేళ్లు జైల్లో కూడా మ‌గ్గారు. ప్ర‌స్తుతం బెయిల్‌పై రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఆ కేసు క‌త్తి ఇప్ప‌టికీ జ‌గ‌న్‌రెడ్డి మెడ‌కు వేలాడుతూనే ఉంది. అప్ప‌టి సీబీఐ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ‌పై వైసీపీ గ్రూపులు సోషల్ మీడియాలో తెగ విమ‌ర్శ‌లు చేసేవారు. ల‌క్ష్మీనారాయ‌ణ‌ను శ‌త్రువుగా చూసేశారు. ఇంత‌కీ ఆయ‌న చేసిందేమీ లేదు.. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లో లోతుగా ద‌ర్యాప్తు చేసి.. ప‌క్కాగా ఆధారాలు సేక‌రించి.. ప‌క‌డ్బందీగా చార్జిషీట్లు వేయ‌డం. అందుకే, ఇప్ప‌టికీ ల‌క్ష్మినారాయ‌ణ అంటే వైసీపీకి మంట‌. లేటెస్ట్‌గా, అదే రీతిలో వివేకా కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పైనా వైసీపీ వ‌ర్గాలు అటాక్ చేస్తున్నాయి. ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా మార‌డాన్ని కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇప్ప‌టికే అందుకు అంగీక‌రించొద్దంటూ స‌హా నిందితులు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. ఆ కేసు కొట్టేసింది న్యాయ‌స్థానం. ఆ ఫిర్యాదు వెనుక వైసీపీ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇక‌, సీబీఐ ఎస్పీ రాంసింగ్ త‌మ‌ను వేధిస్తున్నాడంటూ.. ఆయ‌న‌పై పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు కూడా చేశారు నిందితులు. అది కూడా వారే చేయించారని అంటారు. ఇప్పుడిక నేరుగా స‌జ్జ‌ల‌నే రంగంలోకి దిగి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై విమ‌ర్శ‌ల‌కు దిగారు. కేసు ఉచ్చు త‌మ మెడ‌కి బిగుస్తుంద‌ని అర్థం కాగానే.. చార్జిషీట్‌లో అవినాశ్‌రెడ్డి పేరు చేర్చ‌గానే.. విమ‌ర్శ‌ల డోసు పెంచేశారు. సేమ్ టు సేమ్‌.. అప్ప‌టి ల‌క్ష్మీనారాయ‌ణ‌లానే.. ఇప్పుడు రాంసింగ్‌ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.

Related Posts