YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మౌనమునిగా మాణికం ఠాగూర్

మౌనమునిగా మాణికం ఠాగూర్

హైదరాబాద్, ఫిబ్రవరి 18,
కాంగ్రెస్ పార్టీ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏ నాయకుడు ఎలా మారతాడో ఊహించడం చాలా కష్టం. రాష్ట్ర నాయకత్వం నుంచి మొదలు పెడితే జిల్లా నాయకుల దాకా అందరూ ఇదే బాపతే. ఇంచార్జ్ గా రాగానే తన పవర్ ను చూపించిన ఆయన ఇప్పుడు మాత్రం సైలెంట్‌ అయిపోయారు. ఎవరేం చెప్పినా చూద్దాం చేద్దాం అంటున్నారట. ఇంతకీ ఆయన ఎందుకలా మారాడనేది ఇప్పుడు గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వచ్చి రాగానే తన దైనశైలి లో దూసుకుపోయారు మాణికం ఠాగూర్  . ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టి క్యాడర్ ని ఉరుకులు పరుగులు పెట్టించారు. ఆయన ఛార్జ్ తీసుకున్నాక వచ్చిన ఎన్నికల్లో గెలుపు ఓటములు పక్కన పెడితే క్యాడర్ లో జోష్ నింపేందుకు అందరి నాయకులకు అల్టిమేటం జారీ చేశారు. ఆతరువాత పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా తనదైన మార్క్ ని చూపించారు.తెలంగాణ పీసీసీ చీఫ్‌ విషయంలో ఎన్ని తలనొప్పులు వచ్చాయో అందరికీ తెలిసిందే. వాటన్నిటినీ తనదైన శైలి లో ఎదుర్కొన్నారు ఠాగూర్. ఆఖరుకు డబ్బులు తీసుకుని పీసీసీ పదవి అమ్ముకున్నారని సొంత పార్టీ నాయకులే ఆరోపించినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. పీసీసీ ఎన్నిక దగ్గర నుంచి హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు అన్నిటికీ దీటుగా సమాధానం చెప్పాడు. కానీ ఇప్పడూ మాత్రం పూర్తి సైలెంట్ అయిపోయారు మాణిక్యం ఠాగూర్. అడపా దడపా ప్రతిపక్షంల పై ట్వీట్ లు పెట్టడం తప్ప పార్టీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విడవమంటే పాము కోపం, కరవమంటే కప్పకి కోపం అన్నట్టుగా ఉంది ప్రస్తుత ఇంచార్జ్ పరిస్థితి. ఎవర్ని ఏమంటే ఏమౌతుందో అని సైలెంట్ ఐపోయారట ఠాగూర్ జి. గత కొద్ది రోజుల నుంచి అనేక సమస్యలు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి. హుజురాబాద్ తరువాత తెలంగాణ కి రావాలంటేనే జంకుతున్నారట. ఇక్కడి నాయకుల ఫోన్ లు ఎత్తేందుకు కూడా సంశయిస్తున్నారట. నేతల వరుస ఫిర్యాదులు, వరుస ఓటములు మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఒకవైపు హనుమంతరావు, పొన్నాల, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డి వాళ్లతో తల నొప్పి, మరో వైపు జనగామ విషయం లో ఉత్తమ్ vs పొన్నాల,ఆదిలాబాద్ ప్రేమసాగర్ vs హనుమంతరావు ఇంకో వైపు క్రమశిక్షణ కమిటీ పై ఫిర్యాదులు వస్తున్నా తనకేం పట్టనట్టు ఉన్నారు. ఆఖరికి పీఏసీ మీటింగ్ లో అందరూ నాయకులు రాకున్నా కూడా వాళ్లని అడగలేని పరిస్థితి ఠాగూర్‌ ది. ప్రతి చిన్న విషయానికి స్పందించే మాణిక్యం కావాలనే దూరంగా ఉంటున్నారా లేక మరే దైనా కారణం ఉందా అని గాంధీ భవన్ వేదికగా చర్చ నడుస్తోంది.

Related Posts