YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతులను రుణ విముక్తులను చేయడానికి రైతు బంధు

రైతులను రుణ విముక్తులను చేయడానికి రైతు బంధు

తెలంగాణ రాకముందు గత పాలకులు పలు రకాలుగా విమర్శలు చేశారు. కరెంటుకోసం దర్నాలు చేసేపరిస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నాడు మహబూబ్ నగర్ భూత్పూర్ లో జరిగిన రైతు బంధు  కార్యక్రమంలో అయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకుల నేరపూరిత ఆలోచన కారణంగా పాలమూరు జిల్లా పూర్తిగా నష్టపోయింది. ఎవరు ఎన్ని కేసులు వేసిన భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరందించి తీరుతాం. ఒక్క దేవరకద్ర నియోజక వర్గంలో కర్వెన రిజర్వాయర్ కోసం 5700 ఎకరాల భూసేకరణకు సహకరించిన రైతులకు శిరస్సు ఒంచి పాదాబివందనమని అన్నారు. పోలీసు స్టేషన్లలో బందోబస్తు మద్య ఎరువులు పంపిణీ చేసిన ఘటనలు కాంగ్రెస్ నేతలు మర్చిపోవద్దు.  నకిలీ విత్తనాలు అమ్మే వారిని పీడి యాక్ట్ ద్వారా కేసులునపెట్టి రైతుకు మేలు చేస్తున్న వ్యక్తి కేసీఆర్. రైతులను రుణ విముక్తులను చేయాలనే ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే రైతు బంధు పథకం. కేంద్రప్రభుత్వం, రిజర్వూ బ్యాంక్ సహకారం లేకపోవడంతోనే ఏకకాలంలో పంట రుణమాఫీ చేయలేకపోయామని అన్నారు. గత ప్రభుత్వాలు రాభందులుగా పీక్కతింటే.. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధువుగా రైతుబంధు పథకం చేపట్టింది.. దేశరైతాంగానికి  మేలు జరిగేందుకే, అన్ని రాష్ట్రాల రైతాంగంలో చైతన్యం వచ్చేందుకు రైతుబంధు పథకంపై దాతీయ స్థాయిలో ప్రచారం కల్పించామని కేటీఆర్ అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వారు రైతులకు 4 రూపాయలైనా ఉచితంగా ఇచ్చారా అని ప్రశ్నించారు. వలసలు వెళ్లిన వారు సకాలంలో రాకపోయినా, వారు ఎప్పుడు వచ్చినా చెక్కులు అందించాలని కలెక్టర్ ను౯ మత్రి కు ఆదేశించారు.  కౌలురైతులకు, ప్రభుత్వానికి తగాదాలు పెట్టించే కార్యక్రం కాంగ్రెస్ చేపట్టింది. భూ యజమానులే తమకు అందిన చెక్కులో సగం డబ్బులు స్వయంగా కౌలు రైతులకు అందించి సమస్య పరిష్కారించుకోవాలని అన్నారు. జూన్ రెండు నుంచి రైతులకు ఐదు లక్షల ఉచిత జీవిత భీమా సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి అన్నారు.

Related Posts