విశాఖపట్నం
ఆల్ ఉమెన్ ఆర్మీ యాత్ర విశాఖకు చేరు కుంది.చెన్నై నుండి బయలుదేరిన ఆల్ ఉమెన్ ఆర్మీ బృందం విశాఖకు చేరుకుంది. ఏడు గురు సభ్యుల ఆర్మీ ఆఫీసర్ల బృందం సెయిలింగ్ నౌకతో భారత సైన్యం చరిత్రలో మొట్టమొదటిసారిగా సాహ సోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభిం చింది.ఈఏంఈ సెయిలింగ్ అసోసియే షన్ పర్యవేక్షణలో నిర్వహించబడిన యాత్ర 15 ఫిబ్రవరి 22న చెన్నై నుండి ఫ్లాగ్ ఆఫ్ చేయబడింది. మొత్తం 330 మైళ్ల దూరాన్ని కవర్ చేస్తూ 54 గంటల సాహస యాత్ర అనంతరం విశాఖకు చేరుకుంది. సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకాని కల్ ఇంజనీరింగ్ ఎంసీఈఎంఈ, సదర న్ కమాండ్ సైలింగ్ నోడ్, ఈఎం ఈ సైలింగ్ అసోసియే షన్,ఆర్మీ అడ్వెంచర్ వింగ్లు ఈ కార్యక్రమాన్ని సంయు క్తం గా చేపట్టి భారత ఆర్మీలో మహిళల శక్తిసామర్థ్యా లను తెలియజేసింది.ఈ తరహా సాహస యాత్ర చేపట్టడం విశేషం.