విశాఖపట్నం
వై.ఎస్.వివేకానంద హత్య కేసులో అసలైన నిందితులను పట్టుకో వాలని విశాఖ తెలుగుదేశం పార్టీ దక్షిణం ఇన్చార్జి గండి బాబ్జీ డిమాండ్ చేశారు. అనుమానితుల జాబితాలో ఉన్న వివేకా బంధువులు సీఎం జగన్, ఎంపీ అవినాష్రెడ్డిలను సైతం సీబీఐ విచారిం చాలని కోరారు.వివేకా హత్య జరిగి మూడేళ్లవుతున్నా అతీగతి లేదన్నారు. తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, తర్వాత హత్యని తేలడంతో టీడీపీపై బురదచల్లారని ధ్వజమెత్తారు. తాజాగా సీబీఐ అసలైన దోషులను పట్టుకునే ప్రయత్నం చేస్తుండడంతో దర్యాప్తు అధికారులను తప్పుతోవ పట్టించేందుకు వారిపై రకరకాల ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శిం చారు.అవినాష్రెడ్డి కక్ష పెంచుకోవడం వల్లే ఈ హత్య జరిగిందని అనుమానా లున్నందున ఆయనను విచారించాల ని కోరారు. మొద్దుసీనులాగే అప్రూవర్ గా మారిన దస్తగిరి అడ్డుతొలగించు కునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దస్తగిరికి పూర్తి రక్షణ కల్పించి, అసలైన నిందితులను పట్టుకోవాలని కోరారు.