YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అధికార పార్టీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష..?

అధికార పార్టీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష..?

మెదక్, ఫిబ్రవరి 18,
సిద్దిపేట మాజీ జిల్లా కలెక్టర్, తెరాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి జైలు శిక్ష తప్పదా? గతంలో ఆయన కలెక్టర్’గా ఉన్న రోజుల్లో చేసిన వ్యాఖ్యలు, ఇప్పడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయా, అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. కలెక్టర్’గా ఉన్న రోజుల్లోనే, అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారనే ఆరోపణలు ఎదుర్కున్న సిద్ది పేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఇప్పుడు అప్పట్లో వరి విత్తనాల విక్రయానికి సంబంధించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల చిక్కులలో ఇరుకున్నారు. అప్పట్లో వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రికి పాదాభివందనంచేసి సంచలనం సృష్టించన విషయం తెలిసిందే. అదే క్రమమంలో గత అక్టోబర్ నెలలో సిద్దిపేటలో వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ హోదాలో వరి విత్తనాల విక్రయానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు, వివాదాస్పద మయ్యాయి. యాసంగి పంట కోసం వరి పాట వేయరాదని ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో విత్తనాలు అమ్మితే కేసులు పెడతామని, కలెక్టర్ హోదాలో ఆయన డీలర్లను హెచ్చరించారు. అంతే అయితే, ఏమో కానీ, ఆయన మరో అడుగు ముందుకేశారు, అనవసరంగా కోర్టుల జోలికి వెళ్ళారు.డీలర్లు   హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా వదిలిపెట్టబోమని, అదనపు హెచ్చరిక జోడించారు. ఇప్పుడు, ఈ అదనపు హెచ్చరికే ఆయన మెడకు చుట్టుకుంది. వెంకట్రామిరెడ్డి చేసినట్లు చెపుతున్న ఆరోపణలకు సంబంధించి హైకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. కాగా హైకోర్టు,  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం కలెక్టర్ కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాదిందే నిజం అయితే, మాజీ కలెక్టర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయనను జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. అందుకే, ధర్మాసనం  కోర్టులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారా? లేదా ? అనే విషయానికి పరిమితమై, స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేయాలని అదేసించింది. నిజానికి, గత ఆదేశాల మేరకు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే, ఆ అఫిడవిట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తావనే లేదు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారా? లేదా? సూటిగా పేర్కొంటూ తాజాగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని వెంకట్రామిరెడ్డిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసినట్లు తేలితే చర్యలు తప్పవని, జైలుకు పంపిస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. అయితే, అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. సో.. మాజీ కలెక్టర్, ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్సీ విషయంలో హై కోర్ట్ ఎలాంటి తీర్పును ఇస్తుందనేది  ఆసక్తికరంగా మారింది.

Related Posts