YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చకచకా మారిపోతున్న తెలంగాణ పాలిటిక్స్

చకచకా మారిపోతున్న తెలంగాణ పాలిటిక్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 18,
తెలంగాణ రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాసలో ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఉహకందని పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే ఏది ఏమైనా, ముందస్తుకు వెళ్ళిన వెళ్ళక పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయక పోవచ్చ‌ని పార్టీ వర్గాలలో బలంగా వినవస్తోంది. అలాగే, కేటీఆర్ నాయకత్వాన్ని ‘రిమోట్’ గా అయినా వ్యతిరేకించే వారికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండక పోవ‌చ్చని, కేసీఆర్ జాతీయ రాజకీయ గీతాలాపనకు అది కూడా ఒక కారణమని అంటున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన తెరాస రాష్ట్ర కమిటీలో, జిల్లా అధ్యక్షులలో ‘కేటీఆర్’ టీముకే పెద్ద పీట వేశారు. ఈ నేపధ్యంలో కేసీఆర్ ఆలోచన అదే అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర పగ్గాలను పూర్తిగా కేటీఆర్’కు అప్పగింఛి, ఢిల్లీకి చేరతారని, పనిలో పనిగా, హరీష్ రావును మెదక్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దించుతారని అంటున్నారు. మరో వంక  కాదు, కేసేఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తూనే, మమత, స్టాలిన్ లానే అసెంబ్లీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, మరో వాదన కూడా  తెలంగాణ భవన’ లో  వినవస్తోంది. అదెలా ఉన్నా, ఇటీవల విలేకరుల సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, అవసరం అయితే వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేస్తానని, అది తనకేమీ కొత్త కాదని చెప్పు కొచ్చారు. ఈ నేపద్యంలో, కేసీఆర్ లోక్ సభకు పోటీ చేస్తే ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారు, అనే విషయంలో రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కేసీఆర్ లోక్ సభకు పోటీ చేయడం అంటూ జరిగితే, కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. గతంలో, ఉద్యమ సమయంలో ఆయన ఇదే నియోజక వర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలిచారు. కరీంనగర్ ఎంపీగానే ఆయన మన్మోహన్ సింగ్  మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. కరీంనగర్ నుంచి రెండుసార్లు గెలిచినా  అందులో ఒకసారి మాత్రమే భారీ మెజారిటీతో గెలిచారు, రెండవ సారి (ఉపఎన్నికల్లో) చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా 1500లో ఏమో స్వల్ప అధిక్యతతో బయట పడ్డారు. అలాగే, కరీంనగర్ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వినోద్ కుమార్, బీజేపీ అభ్యర్ది, (ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు)  బండి సంజయ్ చేతిలో ఒడి పోయారు. సో .. కేసీఆర్ నిజంగా  కరీంనగర్ బరిలో దిగితే  పోటీ బాగా రక్తి కడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటుగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే ముక్కోణపు పోటీ అనివార్యం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. అదే జరిగితే, అప్పటికీ రాజకీయ వాతావరణం ఇదే  విధంగా కొనసాగితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేరీంనగర్ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని అంటున్నారు. అయితే, ఈ లోగా  రాజీయాలు ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో, ఏఒడ్డుకు చేరతాయో ఇప్పుడే చెప్పలేము.

Related Posts