YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

వారణాసిలో కేసీఆర్ కటౌట్

 వారణాసిలో కేసీఆర్ కటౌట్

హైదరాబాద్, ఫిబ్రవరి 18,
మోదీ వ‌ర్సెస్ కేసీఆర్‌. గ‌త కొన్ని నెల‌లుగా మోదీని వెంటాడుతున్నారు తెలంగాణ సీఎం. వ‌రుస ప్రెస్‌మీట్ల‌తో ప్ర‌ధానికి ఏకిపారేస్తున్నారు. బీజేపీని కుమ్మేస్తున్నారు. నోటికొచ్చిన‌ట్టు తిట్టుతూ.. తెగేదాకా లాగుతున్నారు. అది మ‌రింత కంటిన్యూ చేస్తూ.. కేసీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మోదీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న యూపీలోని వార‌ణాసి వీధుల్లో కేసీఆర్ ఫ్లెక్సీలు క‌ట్టి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పాడో అభిమాని. ఇంత‌కీ, కాశీలోనూ కేసీఆర్‌కు ఫ్యాన్స్ ఉంటారా?  లేక‌, మోదీని కవ్వించేందుకే.. గులాబీ బాస్ ఆదేశాల‌తోనే వార‌ణాసిలో ఫ్లెక్సీలు క‌ట్టారా?  తెలంగాణ సీఎం కేసీఆర్ 68వ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన అభిమానులు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసి వీధుల్లో కేసీఆర్ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తుండడం విశేషం. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా వారణాసిలో ఆయనకు విషెస్ చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.కేసీఆర్ అంటే మృత్యుంజయ మిశ్రాకి వల్లమాలిన అభిమానం.. అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా మృత్యుంజయ మిశ్రా వారణాసి వీధుల్లో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో మృత్యుంజయ మిశ్రా తెలంగాణలో విద్యాభ్యాసం చేశాడు. ప్రస్తుతం మిశ్రా వారణాసిలో స్థిరపడ్డాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఉన్న అపారమైన అభిమానంతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారణాసిలోని చౌకాఘాట్, రథయాత్ర లాంటి ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇదీ న్యూస్‌. ఈ న్యూస్ వెనుక రియాల్టీ ఏంటో తెలుసుగా..! మిశ్రాతో ఫ్లెక్సీలు క‌ట్టించింది ఎవ‌రై ఉంటారో తెలుసుగా..! అంతేగా అంతేగా...!!

Related Posts