పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో పంచాయితీ ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ బూత్లపై దాడులు, బూత్లను ఆధీనంలోకి తీసుకోవడం, ఓటర్లను బెదిరించడం, నాటు బాంబుల ప్రయోగం, ఇతర పార్టీల ఏజెంట్లపై టీఎంసీ నాయకుల దాడులు సాధారణమయ్యాయి. నాటబరిలో బీజేపీ పోల్ ఏజెంట్పై చేయిచేసుకున్నందుకు తృణమూల్ కాంగ్రెస్ మంత్రి రబీంద్రనాథ్ ఘోష్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీచేసింది. నందిగ్రాంలో పోలింగ్ బూత్ దగ్గర సీపీఎం కార్యకర్త చేతి వేలును టీఎంసీ కార్యకర్తలు నరికివేసారు. దక్షిణ 24 పరగణా జిల్లాలో సీపీఎం కార్యకర్త నివాసానికి నిప్పుపెట్టడంతోపాటు కార్యకర్తను, ఆయన భార్యను టీఎంసీ కార్యకర్తలు హత్య మార్చారు. మొత్తానికి 3,358 గ్రామపంచాయతీల్లోని 48,650 స్థానాల్లోని 16,814 స్థానాల్లో, 341పంచాయతీ సమితిల్లోని 9,217 స్థానాలకుగాను 3,059 స్థానాల్లో ఎవరూ పోటీచేయలేదని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.