YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశ చరిత్రలో తొలిసారి సంచలన తీర్పు

దేశ చరిత్రలో తొలిసారి సంచలన తీర్పు

న్యూఢిల్లీ ఫిబ్రవరి 18
అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించగా.. 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఒక కేసులో ఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 13ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. కాగా, అహ్మదాబాద్‌లో రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా చేస్కొన్న ఉగ్రవాదులు 2008లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇవి కొన్ని చోట్ల పేలడంతో బాంబు దాడిలో 56 మంది మృతి చెందారు. 200 మందికి గాయాలయ్యాయి. అయితే బాంబులను స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బస్ స్టేషన్లను టార్గెట్ గా చేసుకుని అమర్చారు. పేలుళ్లలో 58 మంది మృతి చెందగా, 200 మందికి గాయాలయ్యాయి. కొన్ని బాంబులను ముందే గుర్తించిన భద్రతా దళాలు వాటిని నిర్వీర్యం చేశాయి. దీంతో భారీ  ప్రాణనష్టం తప్పింది.

Related Posts