YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహారాష్ట్రలోని థానేలో బర్డ్‌ఫ్లూ భయం

మహారాష్ట్రలోని థానేలో బర్డ్‌ఫ్లూ భయం

థానే ఫిబ్రవరి 18
మహారాష్ట్రలోని థానేలో బర్డ్‌ఫ్లూ భయం నెలకొంది. జిల్లాలోని వెహ్లోలిలో ఉన్న ఓ కోళ్లఫారంలో వంద కోళ్లు ఆకస్మికంగా మృతిచెందాయి. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మరణించాయనే అనుమానంతో కోళ్ల నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. వైరస్‌ వ్యాప్తి మరింత చెందకుండా చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ రాజేష్ జె నర్వేకర్ ఆదేశించారు. వెహ్లోలీకి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుమారు 25 వేల కోళ్లను చంపేయాలని అధికారులకు సూచించారు. వ్యాధిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, జిల్లాలో హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుఎంజా కారణంగా పక్షులు చనిపోయాని థానే జెడ్పీ సీఈఓ డా. బహుసాహెబ్‌ దంగ్డే వెల్లడించారు. బర్డ్‌ ఫ్లూ కేసులను గుర్తించినట్లు కేంద్ర పశు సంవర్ధక శాఖకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Related Posts