YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ

హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ

అమరావతి ఫిబ్రవరి 18
తాడేపల్లి మండలం కొలనుకొండలో రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ ఇస్కాన్‌ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు.. యువత కోసం శిక్షణ కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాల నిర్మాణం చేపట్టనుంది. ఇస్కాన్‌ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి మండలం కొలనుకొండ చేరుకున్నారు.అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభించిన అనంతరం తాడేపల్లి మండలం కొలనుకొండ బయల్దేరారు. ఇక్కడ హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేయనున్నారు. ఇస్కాన్‌ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు. దీనిని రూ.70 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇస్కాన్‌ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది.
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌
మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్‌ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను సీఎం జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన ఆహారం ఇక్కడే తయారు చేస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా అవుతుంది. ఇందుకుగానూ, అక్షయపాత్ర ఫౌండేషన్‌ అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసింది.

Related Posts