రాజన్న సిరిసిల్ల ఫిబ్రవరి 18
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. . పర్యటనలో భాగంగా ఓబుళాపూర్‌లో జరుగుతున్న సమ్మక – సారలమ్మ జాతరను కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా వన దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క – సారలమ్మకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వచ్చిన భక్తులను కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపారు. కేటీఆర్ కూడా వారితో కలిసిపోయి.. సరదాగా సంభాషించారు. ఓ భక్తురాలు కేటీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. దీవించింది. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెతో ముచ్చటించారు.