న్యూఢిల్లీ ఫిబ్రవరి 18
దేశవ్యాప్తంగా 330 రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. రద్దయిన రైళ్ల వివరాలను ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. అయితే రైళ్ల రద్దుకు సంబంధించిన స్పష్టమైన కారణాలను ప్రకటించలేదు. ఇందులో తెలంగాణ సహా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, అసోం, బీహార్‌లకు చెందిన రైలు సర్వీసులు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్లే పరిధిలో గుంతకల్- డోన్, డోన్-కర్నూల్ మధ్య ఈ నెల 18 నుంచి 22 వరకు, కర్నూల్-గుంతకల్ స్టేషన్ల మధ్య ఈ నెల 18 నుంచి 23 వరకు పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు చేస్తుండంతో రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.