న్యూఢిల్లీ ఫిబ్రవరి 18
నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ.. కీలక సమాచారాన్ని ఆజ్ఞాత వ్యక్తులకు చేరవేసినట్లు ఆరోపణల నేపద్యం లో ఇవాళ సీబీఐ అధికారులు ప్రశ్నించారు.. 2013 నుంచి 2016 మధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్ర పనిచేశారు. అయితే హిమాలయాల్లో నివసించే ఓ యోగితో స్టాక్ ఎక్స్‌చేంజ్ ఆర్థిక సమాచారాన్ని చిత్ర పంచుకున్నట్లు తెలిసిందే. ఎన్ఎస్ఈ నియమావళి ఉల్లఘించి ఆమె ఆ సమాచారాన్ని ఓ వ్యక్తికి చేరవేశారు. పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై నిన్న ఐటీశాఖ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఒక హిమాలయ యోగితో చిత్ర పంచుకొన్నారని, ఆయన సూచనలతోనే ఎన్‌ఎస్‌ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌తో పాటు పలు కీలక పదవుల్లో క్యాపిటల్ మార్కెటింగ్‌పై ఎలాంటి అవగాహన లేని ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించారని సెబీ దర్యాప్తులో ఇటీవల తేలింది.