నిజామాబాద్
దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ లో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక పోతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ,కమ్మర్పల్లి మండలాల్లో సుమారు 8 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ,శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామంలో 16 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్,5 లక్షల వ్యయంతో నిర్మించిన బిసి కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు.మండల కేంద్రంలో లింగమయ్య దేవాలయానికి 20 లక్షల వ్యయంతో సిసి రోడ్ శంకుస్థాపన చేశారు.చిట్టాపూర్ నేషనల్ హైవే నుండి చిట్టాపూర్ వరకు డబుల్ లైన్ రోడ్ 1.20 కోట్ల వ్యయంతో, 20 లక్షల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవనం,5 లక్షల వ్యయంతో ఎస్.సి కమ్యూనిటీ హాల్,5లక్షల వ్యయంతో నిర్మించే అంతర్గత సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. తరువాత వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... 60 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరాల్లోనే జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు.పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు,డంపింగ్ యార్డులు ఇలా అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందని,కేంద్రంతో సమానంగా గ్రామాలకు నిధులిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు.దేశ వ్యాప్తంగా 10 ఉత్తమ గ్రామాలు ఎన్నికైతే అందులో 7 గ్రామాలు తెలంగాణ నుండే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ మే చెప్తుందని గుర్తు చేశారు. తెలంగాణ పల్లెలు ఎంతగా అభివృద్ధి చెందాయో ఈ గణాంకాల ద్వారా తెలుస్తుందన్నారు.బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ అభివృద్ధి ఎందుకు లేదో ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయాలని కోరారు.బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుందని దీనిపై చర్చకు సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి ని ఒప్పించి అత్యధికంగా 18 గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు కూడా గతంలో ఎట్లుండే,ఇప్పుడు ఎట్లుందో బేరీజు వేసుకొని ఆలోచన చేయాలని కోరారు.అభివృద్ధి చేసేవారి కాళ్ళల్లో కట్టెలు పెట్టే వారికి ప్రజలే బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు.8 ఏండ్ల కింద జరిగిన తెలంగాణ ఏర్పాటు మీద పార్లమెంట్ లో అవమానకరంగా మాట్లాడుతున్న
ప్రధాని మోడీ చేత ఇక్కడి బిజెపి నాయకులు కిషన్ రెడ్డి,సంజయ్,అర్వింద్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేసారు.తెలంగాణ పుట్టుకను ప్రధాని అవమానిస్తుంటే తెలంగాణ బిజెపి నాయకులైన కిషన్ రెడ్డి,సంజయ్,అర్వింద్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని, మీలో తెలంగాణ పౌరుషం లేదా అని నిలదీశారు.కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పట్ల ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.బాగుపడుతున్న తెలంగాణ ను మళ్లీ ఆంధ్రలో కలుపుతారా అని ప్రశ్నించారు.తెలంగాణ సమాజం బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని,మోడీ, అమిత్ షా వ్యాఖ్యలు చూస్తే మళ్లీ ఆంధ్రలో కలుపుతారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారుతెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న బిజెపి తెలంగాణ ప్రజలకు అవసరమా అన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ లో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. బీజేపీ నాయకులు రెచ్చగొట్టే మాటలకు మోసపోతే మళ్ళీ పూర్వపు రోజుల్లాగే గోసపడుతామని ప్రజలు,రైతులు,యువకులు దీనిపై ఆలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.