YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ లో విఖ్యాత హరికథా విద్వాంసులు, పండితులు గుండు వెంకట్రామ శర్మ కన్నుమూత

తెలంగాణ లో విఖ్యాత హరికథా విద్వాంసులు, పండితులు గుండు వెంకట్రామ శర్మ కన్నుమూత

తెలంగాణలో విఖ్యాత హరికథా విద్వాంసులు, పౌరాణికులు,సంస్కృతాంధ్ర పండితులు బ్రహ్మశ్రీ గుండు వెంకట్రామశర్మ ఈరోజు పరమపదించారు.ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్ధిపేట జిల్లా మార్కూక్ మండలం దామరకుంట వాస్తవ్యులయిన వెంకట్రామశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణ లోని అన్ని ప్రాంతాల్లో ఐదు దశాబ్దాల పాటు హరికథాగానంతో  ఉర్రూతలూగించారు. సంగీతం, సాహిత్యం, స్మార్తం,అష్టాదశా పురాణాలు, ఉపనిషత్తులు, శాస్త్రాల్లో వీరు చిన్నతనం లొనే మంచి ప్రావీణ్యం గడించారు. శ్రీ పాండురంగాశ్రమం, యాదగిరిగుట్ట, వేములవాడ, అల్వాల్ శివాలయం సహా అనేక క్షేత్రాల్లో వీరు హరికథలు, పురాణ ప్రవచనాలు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.40 ఏళ్లుగా సికిందరాబాద్ లోని ఘాస్ మండి లో వీరు నివసిస్తున్నారు. గతకొంతకాలంగా వీరు అనారోగ్యం గా ఉండి ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు వైశాఖ మాసశివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. వీరి మృతి పట్ల పలువురు ప్రముఖులు పండితులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.సికంద్రాబాద్ లోని బన్సీలాల్ పేటలో వీరి అంత్యక్రియలు జరుగుతున్నాయి.

Related Posts