విశాఖపట్నం
జివిఎంసి 2022-23 సంవత్సరానికి గానూ ప్రవేశపెడుతోన్న 4061.90కోట్ల బడ్జెట్ ఒక చిత్తుకాగితం, అంకెల గారడీ అని సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు అన్నారు.సిపిఎం నగర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధికి నిధుల ఖర్చు జరగడం లేద ని, దొడ్డిదారిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను తరలిం చుకుపోతుందని విమర్శించారు.విద్య, వైద్యం, రోడ్లు, మురికివాడల సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు బడ్జెట్ల ద్వారా ఇంతవరకూ నయాపైసా ఖర్చు చేయలేదని వివరించారు. ప్రజలపై ఈ బడ్జెట్ భారాలు మోప నుందని, ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపు నిచ్చా రు.ఆస్తిపన్ను 545కోట్లు, చెత్తపై 55కోట్లు, మంచి నీటి ఛార్జీల ద్వారా 386 కోట్లు, బిల్డింగ్ ప్లాన్ ఫీజులు.291 కోట్లు, చెత్త, ట్రేడ్ లైసెన్సుల ద్వారా 20కోట్లు వసూలుకు ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం అన్యా యమన్నారు. ప్రజాబడ్జెట్ కోసం ప్రతిపక్ష కార్పొరేట ర్లంతా ఈనెల 24 నుంచి పోరాడతామని, అధికార వైసిపి కార్పొరేటర్లు కూడా కలిసి వస్తేనే వారి వారి వార్డుల్లో అభివృద్ధి సాధ్య పడుతుందని గంగారావు హితవుపలికారు.బడ్జెట్లలో విశాఖ ప్రజలను దగా చేశారని,వాస్తవ ఆదాయం కంటే అనేక రెట్లు ఎక్కువగా బడ్జెట్ను ప్రతిపాదించడం, అందులో నామమాత్రంగా ఖర్చు చేయడమంటే నగర ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు.ఈ ఏడాది బడ్జెట్లో కనీసం 50కోట్లు కూడా ప్రజావ సరాల కోసం ఎక్కడా ఖర్చు చేసినా దాఖలా లేదన్నా రు.కాం ట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోవడంతో వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభు త్వం ఈ నిధులను తన అవసరాలకు వాడుకోవడం సరైంది కాదన్నారు. సిఎఫ్ఎంఎస్ బారి నుంచి జివిఎంసికి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు.