ఎమ్మిగనూరు ఫిబ్రవరి 19
ఎమ్మిగనూరు మండలంలోని కేజీబీవీ పాఠశాలలో క్షయ వ్యాధి నివారణ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్లకు, విద్యార్థినిలకు క్షయ వ్యాధి లక్షణాలు,వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స కాలపరిమితి, మొండి క్షయ వ్యాధి, డాట్స్ పద్ధతి పై అవగాహన కల్పించడం జరిగింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స ఉచితంగా అందచేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిబి సూపర్వైజర్లు చాంద్ భాషా, మల్లికార్జున,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.