సంగారెడ్డి
పార్టీ వీడొద్దంటూ ఓ కార్యకర్త ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాళ్లపై పడ్డాడు. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు.. జగ్గారెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీని వీడొద్దని.. ఏవైనా సమస్యలుంటే మాట్లాడుకొని పరిష్కరించుకుందామని హనుమంతరావు జగ్గారెడ్డికి సూచించారు. అదేసమయంలో హనుమంతరావు వెంట వచ్చిన కార్యకర్త.. జగ్గారెడ్డి కాళ్లపై పడి.. పార్టీని వీడొద్దంటూ ప్రాధేయపడ్డాడు. పార్టీ వీడనని హామీ ఇస్తేనే కాళ్లు వదులుతానని అన్నాడు.