YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పుంగనూరు ఆవుకు గుర్తింపు

పుంగనూరు ఆవుకు గుర్తింపు

తిరుపతి, ఫిబ్రవరి 21,
మనదేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఎక్కువే. అందులోనూ గోమాతకు మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. ఇంట్లోనే ఆవుల్ని పెంచుకుంటాం. మన చుట్టూ తిరిగే ఆవు దూడలు మన పిల్లలతో సమానంగా పెంచుతాం. ఆవు ఇంట్లో తిరిగితే అది ఎంతో శుభదాయకం అంటారు. ఒక ఆవు జాతి వల్ల ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామం. పుంగనూరు ఆవుకు అనేక ప్రత్యేతలు ఉండడంతో ఎక్కువమంది ఈ ఆవుని పెంచుకోవడానికి ఎంతైనా ఖర్చుపెడతారు. పుంగనూరు ఆవుకి మరింత గుర్తింపునిచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల పోస్టల్‌ శాఖ‘ పుంగనూరు జాతి ఆవు’ పేరిట పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయడంతో ఆ గ్రామం , ఆవు జాతి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.పుంగనూరు పొట్టి జాతి ఆవులతో మరో గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోనే 70–90 సెం.మీ ఎత్తు అంటే సుమారు రెండు అడుగుల ఎత్తు వుండి 115 నుంచి 200 కిలోల బరువు ఉండే ఆవులు పుంగనూరు ఆవులు. లేత బూడిద, తెలుపు రంగులో విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు కలిగి ఉంటాయి. ఇవి రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల పాలు ఇస్తాయి. సాధార ఆవుపాలలో ఔషధ విలువలతో పాటు 3 నుంచి 3.5 వరకు వెన్న శాతం ఉంటుంది. అదే పుంగనూరు ఆవు పాలలో 8 శాతం ఉంటుంది. దీంతో ఈ ఆవుపాలకు మంచి ధర లభిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఈ పాలు ఎంతో మంచివి.తిరుమల తిరుపతి దేవస్థానాల గోశాలలో పుంగనూరు ఆవులను పెంచుతూ ఈ ఆవు పాల నుంచి వచ్చే నెయ్యిని శ్రీవారి అభిషేకానికి వాడుతుండడం మరో విశేషం. గతంలో ఆవుల్ని చాలాకొద్దిమంది మాత్రమే మేపేవారు. కానీ ఇప్పుడు పుంగనూరు తరహా ఆవుల్ని కొనాలంటే లక్షలు పెట్టాల్సిందే. దీంతో ఈ ఆవులు రైతుల పాలిట కామధేనువులుగా మారాయి. తెలుగురాష్ట్రాల్లో ఉన్న పుంగనూరు ఆవుల సంఖ్య కేవలం మూడువందలు మాత్రమే అంటే వీటికి ఎంత ప్రాముఖ్యత వుందో అర్థం చేసుకోవచ్చు. పుంగనూరు ఆవుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఈ జాతి ఆవులు అంతరించి పోయే దశలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పుంగనూరు జాతి ఆవుల మనుగడకు, పునరుత్పత్తికి రూ.63 కోట్ల వ్యయంతో ‘మిషన్ పుంగనూరు రీసెర్చ్‌ ప్రాజెక్టు’ అమలుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కడప జిల్లా పులివెందులలోని ఏపీ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ లిమిటెడ్‌లో ఐవీఎఫ్‌ సాంకేతికతో పుంగనూరు జాతి పశువులను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నడుపుతోంది. పుంగనూరు ఆవు ఇంట్లో వుంటే అదో స్టేటస్ సింబల్. ఈ జాతి విశిష్గతను అందరికీ తెలియచేసేందుకు కేంద్రం పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం పట్ల పుంగనూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts