కడప, ఫిబ్రవరి 21,
రాజకీయంగా తెగ ఆసక్తి రపుతోంది ఈ ప్రతిపాదన. "వివేకా కూతురు సునీతకు టీడీపీ టికెట్ ఇవ్వాలనేది చంద్రబాబు ప్లాన్. వైఎస్ కుటుంబంలో చీలిక తీసుకురావాలనేది టీడీపీ స్కెచ్. అందుకే, వివేకా హత్య కేసులో సీబీఐని ప్రభావితం చేసి.. కేసును అటుతిప్పి ఇటుతిప్పి.. అవినాశ్‌రెడ్డి మెడకు చుడుతున్నారు. దీని వెనుక సునితమ్మకు గాలం వేసే.. వైఎస్ కుటుంబంలో చీలక తీసుకొచ్చే కుట్ర దాగుంది." ఇంతటి అద్భుతమైన స్టోరీని సృష్టించింది మరెవరో కాదు.. జగన్ అంతరంగికుడు సజ్జల. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. జగనన్న తరఫున సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తీరుకు.. ఆందోళన చెందుతున్నారో.. ఫ్రస్టేట్ అవుతున్నారో.. కారణం తెలీదు కానీ.. తెగ ఇదై పోతున్నారు. అందుకే, మోకాలికి-బోడిగుండుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు. వివేకా కూతురు సునీత.. తన తండ్రి హత్యపై అలుపెరగకుండా, ఎవరికీ భయపడకుండా పోరాడుతున్నారు. సీబీఐ విచారణతో అసలు దోషులు, హత్య వెనుక ఉన్న కుట్ర దారులు... అంతా బయటకు వస్తున్నారు. ఆ కుట్ర.. దారులన్నీ.. వైఎస్ కుటుంబ సభ్యుల ఇంటివైపే దారి తీస్తుండటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. తనకు ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారనే కారణంతో వివేకా హత్య వెనుక అవినాశ్‌రెడ్డి హస్తం ఉందంటూ సీబీఐ చార్జిషీట్‌లో తెలపడంతో జగన్ అండ్ కో లో కంగారు పెరిగింది. వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి మెడకు ఉచ్చు బిగిస్తుండటంతో.. పార్టీ పెద్దలు నష్ట నివారణ చర్యలకు దిగారు. జగన్ ఆదేశాలతో సజ్జల.. వరుస ప్రెస్‌మీట్లతో.. సీబీఐ విచారణలో, వివేకా హత్య కేసులో.. లేనిపోని ఆరోపణలు, అనుమానాలు కలిగించి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హత్య కేసును చంద్రబాబునాయుడు, బిటెక్ రవి, ఆదినారాయణరెడ్డిల చుట్టూ చుట్టేసేందుకు తెగ ట్రై చేస్తున్నారు. అవినాశ్‌రెడ్డిని మాగ్జిమమ్ వెనకేసు కొచ్చేలా మాట్లాడారు. అంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్థం కావట్లేదు.. శిక్ష పడక తప్పదని ఆందోళనా? లేక, అది అవినాశ్‌రెడ్డితోనే ఆగిపోదని.. పులివెందుల పెద్దల వరకూ పాకుతుందని భయమా?సజ్జల తన ప్రయత్నంలో భాగంగా.. సునీతమ్మను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలి.. వైఎస్ కుటుంబాన్ని ఎలాగోలా చీల్చాలి.. వివేకా హత్యా నేరాన్ని ఆ కుటుంబం మీదే తోసేయాలి.. ఇది చంద్రబాబు వ్యూహం.. అంటూ సజ్జల చాలా బాగా కథ అల్లి మీడియా ముఖంగా వెల్లడించారు. సజ్జల ఐడియా భలే ఉందంటూ.. సోషల్ మీడియాలో రియాక్షన్లు వస్తున్నాయి. మంచి ఆలోచనే ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. సునీత టీడీపీలో చేరితే.. కడప నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తే.. భలే మజా వస్తుందని అంటున్నారు. వివేకా హత్య కేసు రెఫరెండంగా ఎన్నికలకు వెళితే.. అవినాశ్‌రెడ్డి వర్సెస్ సునీత.. పోటీ రసవత్తరంగా మారుతుందని చెబుతున్నారు. ఇప్పటికే కుటుంబాన్ని ఎదిరించి.. ఎవరికీ బెదరకుండా, లొంగకుండా.. న్యాయ పోరాటం చేస్తున్న సునీత.. ఇక రాజకీయంగానూ పోరాడితే తప్పేమీ లేదని అంటున్నారు. సీబీఐ ఛార్జిషీట్ ప్రకారం.. ఏ కడప ఎంపీ సీటు కోసమైతే వివేకా హత్య జరిగిందో.. అదే కడప ఎంపీ స్థానంలో పోటీ చేసి.. రివేంజ్ కోసం ట్రై చేస్తే బెటరేనని చర్చ జరుగుతోంది. కనీసం, అలాగైనా ఆమెను కాస్తైనా న్యాయం జరుగుతుందని.. వివేకా హత్యపై కాస్తైనా ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు. మరి, ఆరోపణల రూపంలో సజ్జల ఇచ్చిన సలహా టీడీపీ స్వీకరిస్తుందా? వైసీపీలో ఇప్పటికే వణుకు మొదలైందా? సజ్జల చెప్పిందంతా సొల్లు పురాణమే కాబట్టి.. అంతా లైట్ తీసుకుంటారా?